రెండు బ‌డా మూవీలు కొట్టుకుంటుంటే మ‌న‌కెందుకులే అని నంద‌మూరి సినిమా త‌ప్పుకుంది. అలా త‌ప్పుకున్నందుకు ఇప్పుడు సంతోష‌ప‌డుతుంది. విష‌యం ఏంటంటే, ఆగ‌ష్టు 7న అత్తారింటికిదారేది మూవీ రిలీజ్ ఉంది. స‌రిగ్గా నెల రోజుల క్రితం అదే రోజున‌ తెలిసో తెలియ‌కో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న అప్ క‌మింగ్ మూవీ రామ‌య్య..వ‌స్తావ‌య్యా రిలీజ్‌ను పెట్టుకున్నాడు.

త‌రువాత ఎందుకులే అనుకున్నాడో ఏమో దాన్ని సెప్టంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌టానికి డేట్ ఫిక్స్ చేశాడు. ఆగ‌ష్టులో రెండు భారీ మూవీల రిలీజ్ ఉండ‌టం, అవీనూ మెగా ప్యామిలీల మూవీలు కావ‌డం, ఇద్దరూ కొట్టుకునేంత స్టంట్ క్రియోట్ అవ‌డం చూసి నంద‌మూరి ఆనంద ప‌డుతుంద‌ని టాలీ స‌మాచారం.

ఈ విష‌యంలో యంగ్‌టైగ‌ర్‌కి మ‌రో ప్లస్ పాయింట్ క‌లిసివ‌చ్చింది. త‌ను పెట్టుకున్న సెప్టెంబ‌ర్ 27 త‌రువాత‌ త‌రువాత రెండు వారాల‌కి ద‌స‌రా పండుగ సంబ‌రాలు ఉన్నాయి. దీంతో నంద‌మూరి చిన్నోడు ఎటువంటి బ‌డా కాంపిటేష‌న్ లేకుండా ద‌స‌రా హీరోగా మారిపోతున్నాడు. అభిమానులు కూడ యంగ్‌టైగ‌ర్ మూవీను పండుగ వాత‌వ‌ర‌ణంలో సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి రెడీ అవుతున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: