సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనున్న ఈ సినిమాకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జిఎస్టి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా బిజినెస్ జిఎస్టి తర్వాత జరిగింది.


ఇక అంతకుముందే పవర్ స్టార్ త్రివిక్రం సినిమా, ఎన్.టి.ఆర్ జైలవకుశ సినిమాల బిజినెస్ లు జరిగాయి. జిఎస్టి తో ప్రమేయం లేకుండానే పవన్, తారక్ సినిమాల బిజినెస్ జరుగగా మహేష్ సినిమాను లేట్ చేశారు. అయితే అదే ఇప్పుడు మహేష్ సినిమాకు పెద్ద దెబ్బ వేసిందని తెలుస్తుంది. జిఎస్టి ఎఫెక్ట్ తో నిర్మాతలకు అదనపు చార్జీలు తప్పేలా లేవు.


అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా స్పైడర్ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారట. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుందని తెలుస్తుంది. టీజర్ తో సినిమా మీద అంచనాలు పెంచగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.


గ్రాఫిక్స్ వర్క్ వివిధ దేశాల్లో చేయిస్తున్న స్పైడర్ మహేష్ స్టామినా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలే ఏర్పరచుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి. దసరా బరిలో గట్టి పోటీ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా కచ్చితంగా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: