మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నర సింహరెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మెగ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నాడు డైరక్టర్ సుకుమార్. తన నిర్మాణంలో వస్తున్న దర్శకుడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రస్తావన తెచ్చాడు సుకుమార్. 


ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని కాకపోతే తన ఆర్య సినిమా సురేందర్ రెడ్డి అతనొక్కడే కన్నా ఓ సంవత్సరం ముందు రిలీజ్ అయ్యిందని అన్నారు. కథల విషయంలో సురేందర్ రెడ్డి ఫుల్ నేరేషన్ తనతో డిస్కస్ చేసేవాడని. కాని తానే తనకు కొంచం కొంచం చెప్పేవాడని అన్నాడు. ఇక అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయ్యిందని. ప్రస్తుతం చేయబోయే ఉయ్యాలవాడ కథ చెబుతుంటే రంగస్థలం సెట్స్ లో అందరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నాడు సుకుమార్.


ప్రతి ఎపిసోడ్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందని అన్నారు. కచ్చితంగా మెగాస్టార్ 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా మెగా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుందని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న ముహుర్తం పెట్టబోతున్నారట. ఖైది నంబర్ 150 తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న చిరు ఈ సినిమా కోసం కొత్తగా కనిపిస్తారని అంటున్నారు.


ఐశ్వర్య రాయ్, నయనతార హీరోయిన్స్ గా నటించబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారట. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: