టాలీవుడ్ లో ఎలాంటి విశేషం జరిగినా, వ్యవహారం వచ్చినా నేనున్నా నేనున్నా అంటూ అవసరం అయిన అవసరం లేని కామెంట్ లు చేస్తూ ఉంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పాజిటివ్ విషయాల మీద నెగెటివ్ గా చెప్పడం నెగెటివ్ విషయాల మీద పాజిటివ్ స్పందించడం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే చెల్లింది. పొగుడుతున్నాడో తిడుతున్నాడో. ప్రో చెబుతున్నాడో కాన్ చెబుతున్నాడో కూడా అర్ధం కాకుండా బండి నడిపిస్తూ ఉంటాడు వర్మ. అత్యంత పనికిమాలిన విషయాన్ని , ఎవ్వరూ పట్టించుకోని దాన్ని కూడా నిద్రలేపి మరీ స్పందిస్తూ ఉంటాడు వర్మ.



అయితే ఇప్పుడు తాజాగా నడుస్తున్న డ్రగ్ మాఫియా విషయం లో మాత్రం ఎలాంటి స్పందనా ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ. గ‌త రెండు మూడు రోజుల నుంచీ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం టాలీవుడ్‌ని ఊపేస్తోంది. వ‌ర్మ శిష్యులు, వ‌ర్మ‌కి కావ‌ల్సిన‌వాళ్లు, వ‌ర్మ కాంపౌండ్‌తో సంబంధాలున్న చాలామంది పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి. అయినా స‌రే.. వ‌ర్మ నోరు మెద‌ప‌డం లేదు. ట్విట్టర్ కి ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన వర్మ ఇంస్టా లో అయినా స్పందిస్తాడు అని వర్మ ఫాన్స్ భావించారు. కానీ వర్మ అక్కడ కూడా ఏమీ మాట్లాడడం లేదు.



ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని తొలిసారి భ‌య‌ప‌డుతున్నాడేమో. సెక్స్ గురించి, త‌న తాగుడు అల‌వాటు గురించి బ‌హిరంగంగా మాట్లాడిన వ‌ర్మ‌.. డ్ర‌గ్స్ గురించి ఎప్పుడూ స్పందించ‌లేదు. జీవితాన్ని వీలైనంత విచ్చ‌ల‌విడిగా గడిపేయ‌డానికి అల‌వాటు ప‌డిన వ‌ర్మ‌… డ్ర‌గ్స్ విష‌యంలో నోరు మెద‌ప‌క‌పోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉండి ఉంటుంద‌ని టాలీవుడ్ భావిస్తోంది. మ‌రి వ‌ర్మ ఏమంటాడో?? ఎప్పుడు స్పందిస్తాడో??

మరింత సమాచారం తెలుసుకోండి: