టాలీవుడ్ ఇండస్ట్రీని గత మూడు నెలల నుంచి బ్యాడ్ టైమ్ వెంటాడుతుంది.  ఆ మద్య దర్శకరత్న దాసరి, ప్రముఖ కవి డాక్టర్ సీనారే, రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణంతో విషాదం నెలకొంది.  తాజాగా టాలీవుడ్ లో ఎక్కడ చూసినా డ్రగ్స్ కి సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.  ముఖ్యంగా యంగ్ హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డారని పోలీసులు  ఆరోపిస్తున్నారు.  అయితే డ్రగ్స్ వాడటం నేరమే కానీ అది సప్లై చేయడం క్షమించరాని నేరం అంటున్నారు పోలీసులు. 
Image result for drugs tollywood
అయితే టాలీవుడ్ లో కొంతమంది డ్రగ్స్ కి బానిసలై..వాడటమే కాదు డీలర్లకు, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేశారని సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో, ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్ ల అరెస్ట్ తప్పదని సిట్ చెబుతుంది.   ఈ విషయంలో ముగ్గురిపై భారీగానే ఉచ్చు బిగుస్తుంది. అయితే మిగత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కేవలం డ్రగ్స్ వాడేవారు మాత్రమే అని తెలుస్తుంది. ఆ ముగ్గురు మాత్రం ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ వర్గాలు గుర్తించాయి.
Image result for drugs
అంతే కాదు డ్రగ్స్ కి అలవాటుపడి కస్టమర్లుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. అంతే కాదు భవిష్యత్ లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతామని చెబుతున్నారు. కాకపోతే అవి సప్లై చేసిన ఆ ముగ్గురి ని మాత్రం అరెస్ట్ చేయక తప్పదని అంటున్నాయి.
Image result for drugs
రెండు మూడు రోజుల్లో వీరి ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభిస్తాయని, ఆపైనే వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇక నగరంలోని అన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్లు, వాటి మేనేజర్లు, కీలక ఉద్యోగులను కూడా ఓ సారి విచారించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: