గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ ని పట్టి పీడిస్తున్న అంశం ఏదయ్యా అంటే..డ్రగ్స్.  హైదరాబాద్ లో పట్టుబడిని డ్రగ్స్ ముఠా సభ్యుల ద్వారా సేకరించిన కొంత మంది సెలబ్రెటీల లీస్టు లో టాలీవుడ్ కి సంబంధించిన వారు పేర్లు వెల్లడించారు పోలీసులు.  తాజాగా ఈ అంశంపై స్పందించిన మాస్ హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తన పెద్ద కుమారుడు రవితేజపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.  తన కుమారుడు రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదని ఆమె స్పష్టం చేశారు.  

కావాలని కొంత మంది తన కొడుకుపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని..ఇప్పటికే తమ్ముడు చనిపోయిన భాదలో డ్రపెషన్ లో ఉన్న రవితేజకు ఈ విషయం మరింత కుంగ దీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  నా కొడుకు సిగరెట్  తాగడు, తాగేవాళ్లను ప్రోత్సహించడు అని పేర్కొన్నారు.  రవితేజ పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదనే షూటింగ్స్ కి అటెండ్ అవుతున్నాడని అలాంటి మంచి మనిషిపై ఇలాంటి ఆరోపణలు రావడం మమ్మల్ని ఎంతో క్షోభకు గురి చేస్తుందని బాధపడ్డారు.
Related image
ఆ మద్య భరత్ అత్యక్రియలకు హాజరు కాలేదని కూడా రక రకాల రూమర్లు వచ్చాయని..తమ కుటుంబం ఆచారం ప్రకారం భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదని అన్నారు.  అంతే కాదు మద్యం మత్తులోనే రోడ్డుప్రమాదంలో భరత్ చనిపోయాడనేది అవాస్తమని తల్లి రాజ్యలక్ష్మి చెప్పారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే భరత్ అన్నీ మానేశాడని తెలిపారు. భరత్ బిగ్ బాష్ షోకు ఎంపికయ్యాడు.. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: