యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ షోతో ప్రత్యక్షమయ్యాడు. స్టార్ మా ఆధ్వర్యంలో 14 మంది కంటెస్టంట్స్ తో వచ్చిన ఈ షోకి సెలక్షన్స్ టైంలో చాలామందిని ఆడిషన్స్ జరిపారు. అందులో రొమాన్స్ బ్యూటీ మానస్ హిమవర్ష కూడా ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక నిన్న మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవడంతో ఆ షోలో తాను లేనందుకు సంతోషిస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది.


ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో షో మీద చేసిన మొదటి నెగటివ్ కామెంట్ కావడం చేత అందరి ఫోకస్ ఆమె మీద పెట్టారు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అయితే ఆమె మీద మాటల యుద్ధానికే దిగారు. అయితే తాను షో చేయడానికి ఇష్టపడలేదని.. ఎన్.టి.ఆర్ తనకు ఇష్టమైన హీరో అని మళ్లీ కవర్ చేస్తుంది. బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసేందుకు మానసని కలిశారట బిగ్ బాస్ టీం.


అయితే ఆమె మాత్రం షో చేయడానికి నిరాకరించిందట. కారణాలు తెలియవు కాని మానస బిగ్ బాస్ ను కాదన్న విషయం ఇప్పుడు హైలెట్ అయ్యింది. తన కామెంట్ షో మీద చేసినా ఆమె మాత్రం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు మండేలా చేసింది. అందుకే ఆమెని ట్విట్టర్ లో చెడామడా తిట్టేస్తున్నారు తారక్ అభిమానులు. 


అందరికి పరిచయం ఉన్న వ్యక్తులనే బిగ్ బాస్ హౌజ్ లోకి స్వాతగించాడు ఎన్.టి.ఆర్. షో మొదటి రోజు సూపర్ సక్సెస్ అంతేకాదు. వారిని ఉత్సాహ పరిచేందుకు తారక్ చేసిన హోస్టింగ్ టెక్నిక్స్ సూపర్ అని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ తోనే వివాదాస్పదంగా మారాలని చేసిన మానస అలా షాక్ తిన్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: