ఫీల్ గుడ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్షన్ లో ఫీల్ ఉన్న ప్రేమ కథలు తెరకి ఎక్కుతూ ఉంటాయి .. ఇప్పుడు ఆయన ఫిదా సినిమా ప్రోమోలు , ట్రైలర్ , పాటలు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ తెలంగాణా అమ్మాయి అవ్వడం తో ఈ పాత్ర చేసిన సాయి పల్లవి చాలా తక్కువ టైం లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది.


బేసిక్ గా మలయాళం అమ్మాయి అవ్వడం తెలుగు లో మొదటి సినిమా కావడం తో సాయి పల్లవి కి అసలు తెలుగే రాదు కానీ పట్టుదల తో తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలంగాణా యాసని సైతం ఆమె చాలా త్వరగా నేర్చుకుని సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది. అసలు తెలుగు తెలియనివాళ్లు .. వెంటనే ఆ భాష నేర్చుకోవడం కొంత కష్టమైతే .. తెలంగాణ యాస పలకడం మరింత కష్టం.


అలాంటిది ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ యాసను పలకడంలో సాయి పల్లవి ఫుల్ మార్క్స్ కొట్టేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: