జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో విషయంలో త్రివిక్రమ్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ షో విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నాడు అని వస్తున్న గాసిప్పులు ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈ షోకు త్రివిక్రమ్ కు ఒక సున్నితమైన విషయంలో అసంతృప్తి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘బిగ్ బాస్’ షోలో సెలెబ్రెటీగా పాల్గొంటున్న హరితేజా విషయంలో త్రివిక్రమ్ కు అనుకోని సమస్య ఏర్పడింది అని ఫిలింనగర్ టాక్. అనేక టివి సీరియల్స్ లో నటించిన ఈమెకు బుల్లితెర సూర్యాకాంతంగా మంచి పేరుంది. ఇప్పటికే ఈమె ‘అ ఆ’ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత పక్కన నటించింది. 

ఈ పాత్రకు ఆమెకు మంచి పేరు రావడంతో ఆమెకు త్రివిక్రమ్ మళ్ళీ పవన్ తో తాను తీస్తున్న లేటెస్ట్ సినిమాలో మళ్ళీ అవకాసం ఇచ్చాడు. ఇప్పటికే ఆమె పై ఈసినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడ చిత్రీకరించారు అని టాక్. అయితే ఇప్పుడు ఆమెను బిగ్ బాస్ షోలో బంధించడంతో ఆమె ఆ బందిఖానా నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు విడుదల కాని పరిస్థుతులు ఏర్పడ్డాయి అని తెలుస్తోంది.

దీనితో  హరితేజ పాత్ర పవన్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ లో చిన్నదే అయినా ఆమె వల్ల త్రివిక్రమ్ మూవీ ప్రాజెక్ట్ కు అనుకోని సమస్యలు రావడం త్రివిక్రమ్ కు ఊహించని సమస్యగా మారింది అని టాక్ . దీనికితోడు ‘బిగ్ బాస్’ షోలో నటించే సెలిబ్రిటీలు  అందరు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం ఖాయం  అయిన నేపధ్యంలో అలాంటి వివాదాలలో చిక్కుకునే సెలెబ్రిటీలు తనకు ఎందుకు అని త్రివిక్రమ్ తల పట్టుకుంటున్నట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: