‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలెబ్రిటీగా మారిపోయిన రాజమౌళికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఫేస్ బుక్ ట్విట్టర్ ఎకౌంటును ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు 8.5 మిలియన్స్ ఫాలోయర్స్ స్థాయికి చేరింది అంటే జక్కన్న రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది.

వరస విజయాలతో దూసుకుపోతూ పరాజయం అన్న పదాన్ని ఎప్పుడో మరిచిపోయిన రాజమౌళి ఇప్పుడు అతడి అభిమానులకు ఐ కాన్ గా మారిపోయాడు. ఈ నేపధ్యంలో  రాజమౌళి  ఏదైనా ఒక సినిమా గురించి ఒక మాట చెప్పాడు అంటే అది కోట్లువిలువ చేసే పబ్లిసిటీ స్ట్రాటజీగా మారిపోయింది. ఈ పరిస్థుతులలో రాజమౌళి తానూ పొగడ్తలు పొగుడుతూ ప్రమోట్ చేసే సినిమాల విషయంలో పొదుపు పాటించాలి అన్న కామెంట్స్ జక్కన్న అభిమానుల దగ్గరనుంచే వస్తున్నాయి. 

ఆసక్తికరమైన ఈ కామెంట్స్ వివరాలలోకి వెళ్ళితే రాజమౌళికి కొర్రపాటి సాయి వారాహి బ్యానర్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. ఈ సాన్నిహిత్యంతో రాజమౌళి వారాహి బ్యానర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి ఆసంస్థ తీసే ప్రతీ సినిమాను అద్భుతం అంటూ ప్రమోట్ చేస్తున్నాడు. 

ఇదే  పద్ధతిలో రాజమౌళి గతవారం విడుదల అయిన జగపతిబాబు ‘పటేల్ సర్’ ను కూడ విడుదల కాకుండానే అద్భుతం అంటూ ప్రమోట్ చేసాడు. అయితే ఆ మూవీ భయంకరమైన ఫ్లాప్ మూవీగా మారిపోయింది. 

రాజమౌళి మాటలు నమ్మి ఆసినిమాకు వెళ్ళిన అయన అభిమానులు కొందరు రాజమౌళి ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం ఏమిటి అని కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. దీనితో రాజమౌళి ఒక సినిమా గురించి ప్రశంసించే ముందు ముందు వెనుకలు ఆలోచిస్తే బాగుంటుంది కదా అని రాజమౌళి వీరాభిమానులే కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: