అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుమంత్ హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే లాభం లేకుండా పోయింది. కెరియర్ లో సత్యం, గోదావరి అనే రెండు సినిమాలు తప్ప ఏది అతనికి క్రేజ్ తీసుకురాలేదు. లాస్ట్ ఇయర్ విక్కి డోనార్ సినిమా రీమేక్ చేసి నరుడా డోనరుడా అంటూ వచ్చినా సరే సుమంత్ కు చేదు అనుభవమే ఎదురైంది.


ఈ క్రమంలో సుమంత్ మరోసారి మళ్లీ రావా అంటూ ఓ ప్రయత్నం చేస్తున్నాదు. గౌతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ కథనాలు నచ్చి సుమంత్ కొద్దిపాటి గ్యాప్ తో ఈ సినిమా చేస్తున్నాడు. మూడు జెనరేషన్స్ కు చెందిన కథగా ఈ సినిమా ఉండబోతుందట. సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయని అంటున్నాడు సుమంత్.


సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసినా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సుమంత్ ఇన్ని రోజులు ఈ సినిమా గురించి చెప్పలేదట. మళ్లీ రావా అంటూ ఓ ఫీల్ గుడ్ మూవీ టైటిల్ పెట్టారు. సినిమాతో కచ్చితంగా హిట్ కొడతా అంటున్నాడు సుమంత్. ప్రేక్షకులకు నచ్చే కథతో ఈసారి తన ప్రయత్నం ఉందని అందుకే మళ్లీ రావాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు చెబుతున్నాడు సుమంత్. 


ఈమధ్య తన సినిమాలను తానే నిర్మిస్తూ వస్తున్న సుమంత్ ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యాడని అంటున్నారు. రొటీన్ భిన్నంగా ఉండబోతున్న ఈ సినిమా సుమంత్ ఆశిస్తున్న సూపర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి. డైరక్టర్ ఎలాగు కొత్త అతనే కాబట్టి అతని టాలెంట్ చూపించేందుకైనా సినిమా అదిరిపోయే తీసుంటాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: