టాలీవుడ్ సీతమ్మ అంజలి రకరకాల కుటుంబ వివాదాలతో వార్తలలో వ్యక్తిగా మారిందన్న విషయం తెలిసిందే. అంజలి నటించిన లేటెస్ట్ మూవి ‘బలుపు’హిట్ కావడంతో ఇక టాలీవుడ్ బెటర్ అనే ఆలోచనకు అంజలి వచ్చేసిందట. అందుకే ప్రస్తుతం ఈమె ఇక్కువగా మన రాజధానిలోనే ఉంటోoది. పెద్దపెద్ద రాజకీయనాయకులులా సెక్యూరిటీ గార్డుల వలయంలో అందరికీ అంతుపట్ట కుండా మరో సంచలనంగా ఉంటోoదట. తనకు సెక్యూరిటీగా ఐదుగురు బాడీగార్డులను అంజలి ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తన పిన్ని భారతీదేవి వ్యవహారం, తమిళ దర్శకుడు కళoజియంతో వివాదాల నేపధ్యంలో అంజలి ఈ నిర్ణయం తీసుకుందట.నిన్న మద్రాసు హైకోర్టులో అంజలి పిన్ని భారతి తనకు ప్రతి నెలా 50 వేల రూపాయలు జీవన బృతిగా ఇప్పించమని కోర్టును కోరడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటికే కళoజియర్ తనను పెళ్లి చేసుకోమనీ లేదంటే అంజలి ఆదాయంలో వాటా ఇమ్మని డిమెండ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తల నేపధ్యంలో అంజలి తన రక్షణ కోసం సెక్యురిటీ గార్డులను ఏర్పరుచుకోవడం మంచిదే కానీ సినిమాలలో నటించే అంజలి తన జీవితంలోని సంఘటనలను కూడా సినిమా ఫక్కీ లో మార్చుకుని ఒకనాటి హీరో నాగార్జున సినిమా ‘కిల్లర్’ లో శారద కనిపించినట్లు గా సెక్యూరిటీ గార్డుల మధ్య షూటింగులకు వస్తుంది కాబోలు మన తెలుగు సీతమ్మ...

మరింత సమాచారం తెలుసుకోండి: