టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లో సిట్ అధికారులతో విచారణలో పాల్గొన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఉదయం పదిన్నరకు మొదలైన ఇంటరాగేషన్ రాత్రి తొమ్మిదిన్నర వరకు అంటే దాదాపు 11 గంటల పాటు విచారణ జరిగిందని తెలుస్తుంది. పూరి నుండి కీలక ఆధారాలు తీసుకున్నామని.. విచారణకు పూరి సహకరించారని పోలీస్ అధికారులు చెప్పారు. ఇక తనకు తానుగా మీడియా ముందు మాట్లాడని పూరి ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశాడు. 


సిట్ ఆఫీసర్స్ తో విచారణలో పాల్గొన్నానన్న పూరి.. కెల్విన్ ను తానెప్పుడు కలవలేదని.. అతనెవరో తనకు తెలియదని చెప్పానని అన్నారు. పోలీసు వారు ఎప్పుడు పిలిచినా సరే తాను వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నాను. రెస్పాన్సిబుల్ పర్సన్ అయిన నేను డ్రగ్స్ మాత్రమే కాదు ఇల్లీగల్ అనేది తానెప్పుడు చేయలేదని అన్నారు పూరి.


పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన పూరి డిపార్ట్మెంట్ మీద చాలా సినిమాలు తీశానని. ఇక జర్నలిస్ట్ ల మీద కూడా చాలా ఇష్టంతో ఇజం సినిమా చేశాను. కాని ఈరోజు వారు చేసిన పనికి చాలా బాధగా ఉందని అన్నారు పూరి. అన్ని ఛానెల్స్ లో పనిచేసే మీడియా మిత్రులంతా తనకు స్నేహితులే అని.. కలిసిన ప్రతిసారి ఒకరికొకరం మాట్లాడుతామని అలాంటి మీడియా వాళ్లు తెలిసినా తెలియక పోయినా రకరకాల ప్రోగ్రామ్స్ తో జీవితాన్ని నాశనం చేశారని అన్నాడు పూరి. 


నాలుగు రోజుల నుండి ఇంట్లో వాళ్లెవ్వరికి నిద్ర లేదని.. తనకే కాదు నోటీసులు అందుకున్న వారందరి పరిస్థితి ఇదే అని అన్నారు పూరి. మీడియా తెలిసి తెలియని చేసిన కట్టుకథల ప్రోగ్రామ్స్ కు తనకు చాలా బాధ కలిగిందని అన్నారు పూరి.  



మరింత సమాచారం తెలుసుకోండి: