ఒక హీరోకి వరసగా 6 విజయాలు రావడం సర్వసాధారణమైన విషయంకాదు. ఇటువంటి వరస విజయాలు మరే స్టార్ హీరోకి వచ్చి ఉంటే ఈపాటికి అతడి పారితోషికం 20 కోట్లను దాటిపోయి ఉండేది. అయితే అంచలంచలుగా స్వయంకృషితో ఎదుగుతున్న నాని సాధిస్తున్న విజయాలు టాలీవుడ్ టాప్ హీరోలకే ఖంగారు పుట్టిస్తున్నాయి అన్న వార్తలు ఇప్పటికే హడావిడి చేస్తున్నాయి. 

అయితే అటువంటి నాని పై ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒక షాకింగ్ రూమర్ అతడి చుట్టూ హడావిడి చేయడం ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ గాసిప్ గా మారింది. సామాన్యంగా ఒక హీరో ఒక హీరోయిన్ తో కలిసి రెండు సినిమాలలో వరసగా నటిస్తే వారిద్దరి మధ్యా ఎదో సాన్నిహిత్యం ఉంది అని గాసిప్పులు రావడం ఫిలిం ఇండస్ట్రీలో సర్వ సాధారణమైన విషయం. 

నానీతో ‘జెంటిల్‌మేన్‌’ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన నివేదిత థామస్‌కి మంచి పేరొచ్చింది. దీనితో నాని ఆమెను తన లేటెస్ట్ హిట్ మూవీ 'నిన్ను కోరి' చిత్రంలో కూడ నాని నివేదితను తనకు తానుగా సూచించి ఆమెకు ఆ అవకాశం ఇప్పించినట్లుగా ఇప్పటికే గాసిప్పులు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరూ నటించిన రెండు సినిమాలు హిట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరిది హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది.  
ఇది ఇలా ఉండగా నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ఎంసిఏ’ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేసే చిత్రంలో నివేదితని తీసుకోమని నాని సిఫార్సు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రైజ్‌లో వున్న హీరో కావడంతో అతని డిమాండ్లకి నిర్మాతలు కాదనలేక ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోవడానికి అంగీకరించారు అని టాక్. 

ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు వస్తూ ఉండటంతో నాని సెంటిమెంట్ గా భావించి నివేదితను రిపీట్ చేస్తున్నాడా ? లేదంటే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందా అన్న పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే నాని మనస్తత్వం తెలిసినవారు మాత్రం ఇది అంతా నాని ఎదుగుదల చూసి ఓర్వలేనివారు పుట్టిస్తున్న రూమర్లని తెల్చేస్తూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: