మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న డ్రగ్ మాఫియా గురించి తనదైన స్పందన తెలియజేసారు. పూరీ జగన్నాథ్ తో పాటు దాదాపు పదమూడుమంది మీద వచ్చిన డ్రగ్ ఆరోపణల గురించి ఆయన చెప్పుకొచ్చారు. " ఒక్కొక్క సినిమాకీ పూరీ జగన్నాథ్ లాంటి సుపర్ టాప్ డైరెక్టర్ మూడు నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటారు అది అందరికీ తెలిసిందే.


అధికారికంగా ఆ అమౌంట్ తో పాటు అనధికారికంగా ఏదో ఒక కారో వస్తువో తీసుకోవడం కూడా సహజమే అయితే అంతలేసి కోట్ల పారితోషికం తీసుకున్న వ్యక్తి ఇండస్ట్రీ లో ఇతరుల కోసం డ్రగ్స్ ని సప్లయ్ చేస్తున్నారు అనడం చాలా కామెడీ గా ఉంది. కొట్లలో సంపాదిస్తుంటే ఇక లక్షల కోసం డ్రగ్స్ వ్యాపారం ఎందుకు చెయ్యాలి ? " అన్నారు రెడ్డన్న.


" ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణ మీద ఆయన్ని అరస్ట్ చెయ్యాలి అనుకుంటే ఎప్పుడో డ్రగ్స్ తీసుకుంటే వారికి సంబంధించి ఎన్ని టెస్ట్ లు చేసినా ఇరవై నాలుగు గంటల తరవాత నిరోపించడం జరిగే పని కానే కాదు" అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కేవలం ఒక కథని అమ్ముకుంటే కోట్లు గడించే ఆయనకి లక్షల్లో వచ్చే డ్రగ్ కుంభకోణం తో పనేంటి అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: