రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో రుపొందిపబడుతున్న “రంగస్థలం 1985” సినిమాను చరణ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా  పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్.  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు టైటిల్ లోగో మాత్రమే అధికారికంగా విడుదలకాగా ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్
మీడియాకు లీక్ అవుతూ ఉండటంతో ఆఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  

ఈ నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా లీక్ అయిన ఫోటో మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. శరవేగంగా దూసుకెళ్తున్న సుకుమార్ ను ఒక్కక్షణం ఆగమన్నట్లుగా రామ్ చరణ్ పట్టుకున్న ఈ స్టిల్ మెగా ఫ్యాన్స్ కు విపరీతంగా జోష్ ను కలిగిస్తోంది. ఈఫోటో ఈరోజు సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఇది  ఉండగా ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ 80 కోట్ల దరిదాపుకు చేరిపోతూ ఉండటం చరణ్ ను కలవర పెడుతున్నట్లు టాక్. దీనికితోడు గోదావరి జిల్లాలలోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఒక భారీ పల్లెటూరి సెట్ ను ఈసినిమా కోసం సుకుమార్ దాదాపు 4 కోట్ల ఖర్చుతో డిజైన్ చేయడం మరింత సంచలనంగా మారింది. 

మొదట్లో ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సంక్రాంతి రేస్ కు తీసుకు వద్దామని భావించారు అయితే ఇదే సంక్రాంతి రేసుకు పవన్ త్రివిక్రమ్ ల మూవీ రెడీ అవుతున్న నేపధ్యంలో ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నట్లు టాక్. అయితే దాదాపు 100 కోట్ల బిజినెస్ జరగబోతున్న ఈ భారీ మూవీకి డిసెంబర్ సీజన్ ఏమాత్రం కలిసిరాదని ఈసినిమా బయ్యర్లు చరణ్ సుకుమార్ లపై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: