నాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం నాని నిన్ను కోరి హిట్ మజా ఎంజాయ్ చేయడమే కాకుండా వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ. మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తున్నాడు. ఎం.సి.ఏ సినిమా ఇప్పటికే షూటింగ్ నడుస్తుండగా మేర్లపాక గాంధి మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.


ఇక ఈ సినిమా టైటిల్ గా కృష్ణార్జున యుద్ధం అని పెట్టారు. సినిమాలో కృష్ణ, అర్జున్ లుగా డ్యుయల్ రోల్ చేయబోతున్నాడు నాని. ఇక ఒక పాత్ర తిరుపతిలో ఉంటుందని.. మరో పాత్ర ప్యారిస్ లో ఉంటుందని తెలుస్తుంది. ఒక పాత్ర మాస్.. మరో పాత్ర క్లాస్ గా ఉంటుందట. ఈ రెండు పాత్రలకు రెండు కథలు.. రెండు ట్విస్టులు ఉంటాయని తెలుస్తుంది.


హలో బ్రదర్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. అయితే ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ మరొటి ఉన్నదట అదేంటి అన్నది మాత్రం సస్పెన్స్ అంటున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎం.సి.ఏ మూవీ డిసెంబర్ లాస్ట్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


ఇక మేర్లపాక గాంధి మూవీని మాత్రం 2018 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారట. మొత్తానికి నాని వరుస సినిమాలు చేస్తూ వాటిని సూపర్ హిట్లు గా మలచుకుంటున్నాడు. నిన్న మొన్నటిదాకా 3 కోట్ల దాకా ఉన్న నాని రెమ్యునరేషన్ కూడా 8 కోట్ల దాకా చేశాడని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: