బిగ్ బాస్ రియాలిటీ షోలో హౌజ్ మెట్స్ అందరికి కెప్టెన్ గా సంపూర్ణేష్ బాబు ఉండటం తెలిసిందే. సంపూ నిరాడంబరత అందరికి నచ్చింది. అంతేకాదు హౌజ్ మెట్స్ మధ్య గొడవ జరుగుతుంటే సంపూ వచ్చి వేసే జోకులు ఆ మూడ్ నుండి వారిని బయటకు తీసుకు రావడమే కాకుండా నవ్వుల జల్లులు కురిపిస్తున్నాయి. 


రీసెంట్ నాలుగో రోజు హౌజ్ మెట్స్ ప్రిన్స్, హరితేజ్ల మధ్య చిన్న పాటి మాటా మాటా వాదన జరిగింది. ఆదర్శ్, ప్రిన్స్ లు మాట్లాడుతున్న సమయంలో అనవసరంగా హరితేజ జోక్యం చేసుకుని నానా రచ్చ చేసింది. ఈ విషయంపై ఇద్దరు కొద్దిసేపు దెబ్బలాడారు కాస్త టైం దొరకగానే సంపూ అలా వారి మధ్యకు వచ్చి భయ్యా సన్న పిన్ను చార్జర్ ఉందా అన్నాడు.


అంతే అక్కడ ఉన్న వారంతా గొడవ పడ్డ ప్రిన్స్, హరితేజలు కూడా నవ్వారంటే చూడండి. కూల్ కెప్టెన్ గా హౌజ్ మెట్స్ మధ్య జరుగుతున్న గొడవలను గమనిస్తున్న సంపూ తను మాత్రం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వట్లేదు. ఇక మరో పక్క మొదటి ఎలిమినేషన్ కు ఎవరు బయటకు వస్తారు అన్న విషయం మీద కూడా పెద్ద డిస్కషన్స్ నడుస్తున్నాయి.


తమకు నచ్చని వారిని ముందు బయటకు పంపే ఏర్పాట్లు చేస్తుండగా మొదటి ఎలిమినేటర్ ఎవరై ఉంటారు అన్నది ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఇక శని ఆదివారాలలో తారక్ రానే వస్తాడు. అప్పుడు హౌజ్ మెట్స్ తో తారక్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రేక్షకులు ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


షో కాత్ర నీరసంగా స్టార్ట్ అయినా ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ కూడా షో మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్లోసారి తారక్ వచ్చి హుశారు ఎక్కిస్తే కాని మళ్లీ జోష్ వచ్చేలా లేదు. ఇక మొదటి రెండు టాస్కులకే ఇలా ఉంటే అసలు మిగతా టాస్కులు ఎలా ఉంటాయో అని కూడా హౌజ్ మెట్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఆలోచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: