ఆనంద్  సినిమాతో తెలుగు సినిమా మేకింగ్ లో ఒక నూతన ఒరవడి సృష్టించిన శేఖర్ కమ్ముల ఆ సినిమా ఘన విజయం తరువాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా మారి పోతాడు అని భావించారు అంతా. అయితే ఆ తరువాత ఈ విలక్షణ దర్శకుడు తీసిన హ్యాపీ డేస్ సంచలన విజయం సాధించినా ఆ తరువాతకాలంలో అతడు తీసిన సినిమాలు ఫెయిల్ అవడంతో తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాడు. 

అయితే సినిమాలు ఫెయిల్ అయినా క్రియేటివ్ దర్శకుల లిస్టులో శేఖర్ కమ్ముల ఎప్పుడు మొదటి వరసలో కొనసాగుతు వచ్చాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న ఈదర్శకుడు స్టార్‌ హీరోలతో పనిచేయాలని ఎంతకాలంగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అయితే స్టార్ హీరోలు శేఖర్ కమ్ముల చెపుతున్న కధలు వింటున్నారు కాని ఈ డైరెక్టర్ కు డేట్స్ ఇవ్వడంలేదు. ఈ పరిస్థితులలో ఈ రోజు విడుదల కాబోతున్న తన ‘ఫిదా’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ విలక్షణ దర్శకుడు టాలీవుడ్ టాప్ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

‘లీడర్‌’ కథ మహేష్‌ కు చెబితే అతడు చేయను అన్న విషయాన్ని వివరిస్తూ ‘ఫిదా’ స్టోరీని కూడా మహేష్‌కి, చరణ్‌కివినిపించినా వారు ఆసక్తి చూపించని విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో ఈ దర్శకుడు  మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచి మారుతోందని ఒకే తరహా మూస సినిమాలని వారు ఇష్టపడడం లేదని అయితే ఈ విషయాలు ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోలు గుర్తించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.   

అయితే టాప్ హీరోల కోసం తన పద్ధతి మార్చుకోను అనిఅంటూ టాప్ హీరోలు తనలా ఆలోచించే దర్శకులని గుర్తించాలని అంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచాడు. అయితే  ఈ రోజు విడుదల అవుతున్న ‘ఫిదా’ శేఖర్ కమ్ముల అంచనాలకు అనుగుణంగా సూపర్ హిట్ అయితే టాప్ హీరోలు అంతా శేఖర్ కమ్ముల వైపు చూస్తారేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: