‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో ప్రభాస్ రానాలకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడటమే కాకుండా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడ పెరిగింది. దీనితో ఈ ఇద్దరి హీరోలలో ఎవరు మీడియా ముందుకు   వచ్చినా వారిద్దరి వ్యక్తిగత జీవితాల పై ప్రశ్నలు ఎదుర్కోవడం సర్వసాధారణ మైన విషయంగా  మారిపోయింది. 

తానూ లేటెస్ట్ గా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ప్రమోట్ చేస్తూ సోసోషల్ మీడియాలో చాట్ చేస్తున్న రానాను అతడి అభిమానులు మళ్ళీ అతడి పెళ్లి విషయమై కార్నర్ చేసారు. ఈ నేపధ్యంలో రానా తన పెళ్లిపై మరోసారి తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. 

తన పెళ్లికి అప్పుడే ఏమి తొందరొచ్చిందని తన అభిమానుల్ని ప్రశ్నిస్తూ తనకంటే పెద్దవాళ్లయిన ప్రభాస్, నితిన్ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాను అంటూ సమాధానం దాటావేసాడు రానా. ప్రభాస్ నితిన్ తనకంటే వయస్సులో పెద్దవాళ్ళు అన్న సంగతి గుర్తుకు చేస్తూ వాళ్ళ పెళ్లి తరువాత తాను పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ముందు వాళ్ల పెళ్లి కానివ్వండి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

ప్రస్తుతం నాకు 33  ఏళ్ళు  మాత్రమే అంటూ తన ఇంట్లో వాళ్లే  తనను పెళ్లి విషయంలో తొందర పెట్టడం లేదు మీకెందుకు తొందర అంటూ జోక్ చేసాడు. ‘బాహుబలి 2’ విడుదల తరువాత తన పెళ్లి ఉంటుంది అని లీకులు ఇచ్చి తన మాట తప్పిన ప్రభాస్ కు రానా  స్వీట్ సెటైర్  మరోసారి ఉల్లిక్కి పడేలా చేస్తోంది అనుకోవాలి. అయితే  నితిన్ త్వరలో  కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో రానా కామెంట్స్ ప్రభాస్ కు తన పెళ్లి విషయంలో ఏమైనా స్పీడును పెంచుతాడేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: