1977లో మూడున్నర వేల మంది ఉద్యోగులతో ప్రారంభమై నేటికి 2.50 లక్షల మంది ఉద్యోగులు కలిగి ఉన్న సంస్థగా ఎదిగి 16.5 లక్షల కోట్ల టర్న్ వోవర్ కు చేరుకున్న రిలియన్స్ వార్షిక లాభం ౩౦ వేల కోట్లు అంటే ఎవరికైనా షాక్ ఇచ్చే విషయమే. భారతీయ పారిశ్రామిక రంగాన్ని మాత్రమే కాదు భారతదేశ రాజకీయ వ్యవస్థను శాసించే మహత్తర శక్తిగా ఎదిగిన ముఖేష్ అంబాని గురించి తెలియని వారుండరు.

ఇప్పటికే ‘జియో’ ఫోన్ ద్వారా సంచలనాలు సృష్టించిన రిలియన్స్ తమ ‘జియో’ సంస్థ నుండి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ ఫోన్ బిజినెస్ ప్రమోషన్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగ వ్రాసిన ‘బాహుబలి’ ని ఉపయోగించుకోవడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. వాయిస్‌ కమాండ్స్‌ ఆధారంగా కూడా పనిచేసేలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ని రూపొందించారు. 

అయితే ఈ ‘జియో’ ఫోన్‌ ఆవిష్కరణ సందర్భంగా 'బాహుబలి-2' ట్రెయిలర్‌ని ఫోన్‌లో ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు ముఖేష్ అంబాని. కేవలం వాయిస్ కమాండ్ ఆధారంగా ‘బాహుబలి 2’ ట్రైలర్ ను ప్లే చేయడంతో ఈ కార్యక్రమానికి వచ్చినవారు అంతా షాక్ అవ్వడమే కాకుండా కొంతసేపు ‘బాహుబలి’ మ్యానియాలోకి వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. 

ఇదే కార్యక్రమంలో ఈ ప్రోడక్ట్ ను వివరిస్తూ  'వినాయకచవితి ఎప్పుడు.?'అనేప్రశ్నతో వాయిస్‌ కమాండ్‌ని లైవ్‌ గా చూపించారు. ఆ తర్వాత 'వందేమాతరం' సాంగ్‌ని ప్లే చేశారు. ఆ వెనువెంటనే ‘బాహుబలి’ ప్రస్తావన రావడంతో అంబానీలు కూడ ఇంకా ‘బాహుబలి’ ని మరిపోలేక పోతున్నారా అని అనిపించేడట్లుగా కామెంట్స్ వినిపించాయి. 
ఈ సందర్భంలో ఈఫోన్ ఫీచర్స్ ను వివరిస్తూ ఈ ఫోన్ కు 1500ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడితే ఈ మొత్తాన్ని తిరిగి మూడు సంవత్సరాలు తరువాత రిఫండ్ ఇస్తామని ప్రకటించడం కార్పోరేట్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలను సృష్టిస్తోంది. ఏమైనా రాజమౌళి హవా ‘జియో’ మీట్ లో ప్రతిధ్వనించడం తెలుగువారి గొప్పతనానికి నిదర్శనం..


మరింత సమాచారం తెలుసుకోండి: