యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. జూనియర్ స్టార్ట్ చేసిన ఈ షో కంటెస్టంట్స్ విషయంలో ఆడియెన్స్ బాగా నీరసపడుతున్నారు. ఎలాగోలా నడుస్తుంది అనుకుంటుంటే మరో పక్క గొడవలు కూడా షురూ అవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే తారక్ ఎంట్రీతో మళ్లీ బిగ్ బాస్ కు ఊపొచ్చింది.


నిన్న హంగామా చేసిన తారక్ ఈరోజు కూడా అభిమానులను అలరించాడు. ఇక ఎలిమినేషన్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసిన తారక్ ముందు హౌజ్ మెట్స్ కు ఓ టాస్క్ పెట్టేసి సరదాగా నడిపించాడు. ఇక అందరు అన్నివిధాలుగా ఎలిమినేట్ చేసిన హౌజ్ మెట్ ఎవరు అంటే జ్యోతి అని తేలింది. అవును బిగ్ బాస్ తెలుగు మొదటి ఎలిమినేటర్ జ్యోతి.


నిన్న మహేష్ కత్తి అనుకున్న ఆడియెన్స్ కు ఈరోజు తారక్ షాక్ ఇచ్చాడు. జ్యోతిని ఎలిమినేట్ చేసి అసలు సిసలైన ట్విస్ట్ ఇచ్చాడు. జ్యోతి ఎలిమినేషన్ హంగామా లెక్కలన్ని అలా నడిపించారు. కంటెస్టంట్స్ అందరిలో జ్యోతి మీద ఓ నెగటివ్ ఫీలింగ్ ఉండటం విశేషం. ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో జ్యోతికి ఎన్.టి.ఆర్ క్లాస్ పీకుతుంటే ముమైత్ ఖాన్ ఎంజాయ్ చేయడం కూడా తెలిసిందే.


మొత్తానికి తారక్ బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేటర్ గా జ్యోతి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చింది. తెలుగులో క్రేజీ రియాలిటీ షోలో పాటిస్పేట్ చేసినందుకు జ్యోతి కూడా మంచి ఎంటర్టైన్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక శని ఆదివారం మాత్రమే వచ్చే తారక్ అలా వచ్చి ఇలా వెళ్లినట్టయ్యింది. తారక్ వచ్చిన ఈ రెండు రోజులు బిగ్ బాస్ టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక గడవబోయే వారం ఎలా సాగనుందో ఎవరు తర్వాత వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: