ఒక వైపు రాష్ట్రమంతా వర్షాలతో ముద్దైపోతూ చలి పుట్టిస్తున్నా పవర్ స్టార్ అభిమానులకు మాత్రం ఈరోజు జరుగబోతున్న ‘అత్తారింటికి దారేది’ ఆడియో వేడుక పాస్ ల వేడితో చలి కాసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎ భారీ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏర్పడనంత క్రేజ్ ఈ సినిమాకు ఏర్పడటంతో ఈ ఆడియో ఫంక్షన్ పాస్ దొరికితే చాలు కోటి రూపాయలు లాటరీ తగిలినట్లు గా ఆనంద పడిపోతున్నారు. నిన్న సాయంత్రం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర పవన్ అభిమానులు ఈ సినిమా పాసుల కోసం చేసిన ధర్నా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. సామాన్యంగా ఇటువంటి ఆడియో వేడుకుల పాసులకు అభిమానుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

కానీ విచిత్రంగా ఈసారి ఈ ఆడియో వేడుక పాస్ ల కోసం పోలీసు శాఖలో ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాదికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల కుటుంబాల నుండి కూడా వి.వి.ఐ.పి పాసులకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల పై ఒత్తిడి పెరగడం తో ఏమి చేయాలో అర్ధం కాక వారు వాళ్ళ సెల్స్ ను కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టేసారట. భద్రతా కారణాల రీత్యా ఇండోర్ ఆడిటోరియం లో ఈ వేడుక జరగడం తో సీటింగ్ కెపేసిటి పరిమితంగా ఉండటం తో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పవన్ అభిమానుల సంఘాల నుంచి వస్తున్న వత్తిడిని ఈ సినిమా నిర్మాత తట్టుకోలేక ఆడియో ఫంక్షన్ వేడుక పాసులు దొరకలేదని బాధ పడవద్దని అభిమానులంతా ఈ వేడుకను తమ ఇంటిలోనే బుల్లి తెర పై చూసి అనందించ మనీ పాసులు లేకుండా ఈ వేడుకకు వచ్చి సాహసం చేయవద్దని కోరుతూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.

టాలీవుడ్ చరిత్రలో ఏ ముఖ్య అతిధిని పిలవకుండా అన్నీ తానై అంతటా తానై పవన్ మాత్రమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఈరోజు జరగబోతున్న ఈ ఆడియో వేడుక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం...

 

మరింత సమాచారం తెలుసుకోండి: