శృతిహాసన్ వెరీ హాట్ గురూ... అంటూ దేశ వ్యాప్థంగా సినీ ప్రేక్షకులు తెగమెలికలు తిరుగుతున్నారట. ఇక సినీ ప్రపంచంలో నాన్న కమల్ హాసన్ పేరును మైమరిపించేంత స్థాయికి ఎదగడం ఖాయం అంటున్నారట సినీవర్గాలు. ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ అవుతూ సినీప్రపంచంలో తన బలుపు చూపిస్థుంది అని అనుకున్నట్టుగానే చూపించింది అన్న టాక్ వచ్చేసిందట.

బాలీవుడ్ లో ‘రామయ్యా వస్థావయ్యా’ తో పాటు డి-డే సినిమా ఒకే రోజు విడుదలయిన సంగతి తెలిసిందే. డి-డే సినిమాలో శృతి పాత్రపై ముందుగానే వచ్చిన హాట్ టాపిక్ కు తగ్గట్టు సినిమాలో వేశ్యపాత్రలో తన నటన, హొయలతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడమే కాకుండా, కైపెక్కించడంలో కూడా సక్సెస్ అని విమర్శకులు కితాబిచ్చేసారు.

టాలీవుడ్ లో గబ్బర్ సింగ్, బలుపు సినిమాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన శృతిహాసన్ కు ఇప్పుడు బాలీవుడ్ లో డి-డే కూడా కమర్శియల్ గా కలెక్షన్లను తెచ్చిపెడితే ఇక హీరోయిన్ గా ఆమె కు ఎదురుండదు అంటున్నాయి సినిమావర్గాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: