హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుదామని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మీ అక్కడ కలిసిరాక పోవడంతో నెమ్మదిగా బుల్లితెర పై తన క్రేజ్ ను పెంచుకుని ‘జబర్దస్త్’ షోతో టాప్ యాంకర్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ తో టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన రష్మీ తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం ఆమె చాల టివీ షోలకు హాట్ యాంకర్ గా మారిన నేపధ్యంలో ఆఖరికి సినిమా వాళ్లు కూడా రష్మీని కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యులు చేయించుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి రానా’ షోకు అతిధిగా వచ్చింది. మిగతా బుల్లితెర టివి టాక్ షోలతో పోలిస్తే ఈ షోకు మంచి రేటింగ్స్ రావడమే కాకుండా దీనిని స్పాన్సర్ చేస్తున్నది ఒక మద్యం కంపెనీ వాళ్లు కాబట్టి ఈ షోలో కొంత బోల్డ్ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికితోడు రానా తన గంభీరమైన స్వరంతో తనముందు కూర్చున్న సెలెబ్రెటీని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తున్నాడు. 

ఈ సందర్భంలో రానా రష్మీని తన ‘ఫస్ట్ కిస్’ ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగాడు. ‘మీ మొదటి ముద్దు ఎప్పుడు పెట్టారు’  అనేది ప్రశ్న. అయితే అమ్మనో - నాన్ననో ముద్దు పెట్టుకున్నాను అంటూ తప్పించుకోవడానికి వీలులేదు అని కండిషన్ పెట్టాడు రానా. 

అయితే రష్మీ ఏమాత్రం మొహమాట పడకుండా తన 14వ యేటనే తన ఫస్ట్ కిస్ రుచి చూశానని రష్మీ చెప్పడమే కాకుండా ఏదో ఎగ్జయిట్ మెంట్ కొద్దీ ఎక్స్‌పెరిమెంటల్ గా ఆ ముద్దు పెట్టుకున్నాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఆ ముద్దు తాను ఎవరికి ఇచ్చానో సీక్రెట్ అని అంటోంది. ‘గుంటూరు టాకీస్’ సినిమాలో రష్మీ డీప్ లిప్ లాక్ లు ఇచ్చినా ప్రేక్షకులు పట్టించుకోని నేపధ్యంలో రష్మీ ఫస్ట్ కిస్ ను మాత్రం ఆ అజ్ఞాత వ్యక్తి ఎంతవరకు ఎంజాయ్ చేసాడో అన్నదే ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: