తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కలువ కళ్ల సుందరి కాజల్ ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ ఇప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది.  ఈ మద్య చిరంజీవి తో నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ఘన విజయం తర్వాత ఇటు తెలుగు..అటు తమిళంలో కూడా మంచి చాన్సులు కొట్టేసింది.
Image result for టాలీవుడ్ డ్రగ్స్
ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకేట్  పట్టుపడినప్పటి నుంచి టాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి. ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యాంకే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ ముందు హాజరయ్యారు.  కాగా నిన్న మరో సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోని ఇంటిలో గంజాయి బయటపడింది. పక్కా సమాచారంతో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖిల్లో నటి కాజల్ మేనేజర్ రోని ఇంట్లో భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది.
Image result for kajal manager roni
 అతన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తాజాగా ఈ అంశంపై కాజల్ ట్విట్టర్ లో స్పందించింది. తన మేనేజర్ అయినప్పటికీ అతని వ్యక్తిగత వ్యవహారాలతో తనకి ఏమాత్రం సంబంధం లేదు అని తేల్చి చెప్పింది. ఇక పోలీసులు విచారణ ముందుకెళ్తున్న కొద్ది షాక్ కి గురి చేసే వాస్తవాలు బయటకివస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: