ప‌వ‌ర్‌స్టార్ నటించిన అత్తారింటికి దారేది మూవీ ఆడియో ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం జ‌రుగుతుంది. అయితే ప్యాన్స్‌కి పాస్‌లు దొర‌క‌క ఎంతో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక్క ప్యాన్స్ మాత్రమే కాదు, వి.ఐ.పి, వి.వి.ఐ.పి పాస్‌లు కూడ చాలా క‌ష్టంగా దొరుకుతున్నాయి.

ఇటువంటి సిచ్యువేష‌న్‌లో మాకు పాస్‌లు కావాలంటూ నిన్న రాత్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వ‌ద్ద మెగా అభిమానులు నినాదాల‌కు దిగారు. మాకు అత్తారింటికిదారేది ఆడియో ఫంక్షన్ పాస్‌లు కావాలి, లేకుంటే ఇక్కడ‌నుండి వెళ్ళం అంటు ఓ మూడు గంట‌లపాటు వర్షంలోనే ప‌వ‌న్‌పై ఉన్న అభిమానాన్ని గ‌ట్టిగా చాటారు. చేసేది లేక అక్కడ వ‌చ్చిన అభిమానుల‌కు స‌ర్దిచెప్పి పంపించ‌డంతో క‌థ సుఖాంతం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: