ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో తెలుగు బుల్లితెరపై వస్తుంది.  దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తుంది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు..తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.  అయితే హాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ షో తర్వాత బాలీవుడ్ కి పాకింది. ఆ తర్వాత ఇతర భాషల్లో అంటే తమిళ, కన్నడ, తెలుగు లో స్టార్ హిరోలతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు.  తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  
Image result for telugu big boss show
అయితే తెలుగు లో బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఎన్నో రకాల ట్విస్ట్ లు వచ్చాయి.  మొదట అందరూ ఎలిమినేట్ చేయాలనుకున్న సంపూర్ణేష్ బాబు కెప్టెన్సీ హోదా దక్కించుకున్నాడు.  ప్రిన్స్, హరితేజ, ఆదర్శ మద్య జరిగిన పెద్దగొడవ వారు సారీ చెప్పుకోవడంతో ముగిసింది. ఇక సంపూర్ణేష్ తన విధులు సరిగా నిర్విహించడం లేదని తన కెప్టెస్సీ నుంచి బిగ్ బాస్ తీసేశారు.  

 ఆ స్థానంలో సింగర్ కల్పనను కెప్టెన్సీగా నామినేట్ చేశారు బిగ్ బాస్.  ఇక మధుప్రియ తన కుటుంబ సభ్యులు పదే పదే గుర్తుకు వస్తున్నారని ఏడ్వటం..సమీర్ కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని సరిగా నిర్వర్తించకపోవడంతో నేరుగా నిష్క్రమణకు గురి కావడం..జ్యోతి ఫస్ట్ వీక్ ఎండ్ లో ఎలిమినేట్ కావడం..ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో సందడి చేయడం ఇలా ఓ రేంజ్ లో బిగ్ బాస్ షో కంటిన్యూ అవుతూ వచ్చింది.  
Image result for telugu big boss show madhu priya
నిన్నటితో తొమ్మిదిరోజులు గడిచింది.  ఇక ‘బిగ్‌బాస్‌' వన్‌ వీక్‌ పర్‌ఫార్మెన్స్‌ని రివ్యూ చేస్తూ వీకెండ్‌లో ఎన్టీఆర్‌ తన బిగ్ బాస్ హౌజ్ మెంబర్స్ కి హౌజ్ లో ఎలా ఉండాలో సంక్షిప్తంగా తెలియజేశాడు. ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తోన్న మధుప్రియతో కన్నీళ్లు విలువైనవి, వృధా చేయకు అని చెప్పాడు. కాస్త నీట్‌గా, ప్రెజెంటబుల్‌గా వుండమని సింగర్‌ కల్పనకి సున్నితంగా చురకేసాడు. కానీ ఎన్టీఆర్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హౌజ్ లో షరామామూలే..మధు ప్రియ ఏడుస్తూనే ఉంది..కెప్టెన్ కల్పన మాత్రం కాస్త రూల్స్, రెగ్యూలేషన్స్ అంటే హడావిడి చేయడంతో ఇప్పుడు అందరూ ఆమెకు యాంటీ అయ్యారు.

ఇక సంపూ విషయానికి వస్తే మొదటి నుంచి తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని..ఇక్కడ తనను బంధించినట్లు ఉందని తాను హెల్తీగా లేనని చెపుతూ వచ్చాడు.  నిన్నటి ఎపిసోడ్ లో ఇది కాస్త ఎక్కువే అయ్యింది..కాబోలు రచ్చ రచ్చ చేశాడు.  దీంతో బిగ్ బాస్ పిలవడంతో తాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనని పర్మిషన్ ఇస్తే వెంటనే వెళ్లిపోతానని అనడంతో..బిగ్ బాస్ పక్క తలుపులో నుంచి వెళ్లిపొమ్మన్ని చెప్పాడు.  ఇప్పుడు బిగ్ బాస్ షో లో జ్యోతి, సంపూర్ణేష్ బాబు లేరు. అయితే సంపూ ఇలా ప్రవర్తించడానికి గల కారణం 'క్లాస్ట్రఫోబియా'కి గురి కావడం అని తోటి సభ్యులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: