హీరోగా , ప్రొడ్యూసర్ గా నాగార్జున కి చాలా అనుభవాలు ఉన్నాయి . ఇన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకి వినోదం అందిస్తున్న ఆయన ప్రొడ్యూసర్ గా కూడా చాలా సినిమాలు చేసారు. తాను నటించే సినిమాలకి జాగ్రత్త తీసుకున్నా తీసుకోకపోయినా తాను నిర్మించే సినిమాల విషయంలో మాత్రం ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటారు. అవుట్ పుట్ విషయం లో చాలా ఖచ్చితంగా ఉంటారు అని నాగ్ కి మంచి పేరు కూడా ఉంది.


ఒకవేళ కొన్ని సీన్ లు ఆయన కి అనుకునట్టు రాకపోతే ఇంకాస్త ఇన్వెస్ట్ చేసి అయినా సరే మంచి అవుట్ పుట్ వచ్చే దాకా రీ షూట్ లు చేస్తారు. ఎక్కడా కథనం లో వేగం తగ్గకుండా ఎడిటింగ్ చేసే టైం లో ఆయన ఇన్పుట్ లు ఆయన ఇస్తూనే ఉంటారు. ఆయన కొత్తగా నిర్మిస్తూ నటించిన సినిమా రాజుగారి గది 2 . ఈ సినిమా విషయం లో కూడా నాగ్ చాలా ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు.


కొన్ని సీన్ లు రీషూట్ చేయించిన నాగార్జున అనేక చోట్ల  గ్రాఫిక్స్ లో మరింత క్వాలిటీ వచ్చేలా చూసుకున్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూసుకుంటే చాలా బాగా వచ్చిందట. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 13 న రాబోతున్న ఈ సినిమా మీద చాలా నమ్మకం తో ఉన్నారు నాగార్జున.


ఒక పక్క ఓం నమో వెంకటేశాయ లాంటి ఆయన చిత్రాలు ప్లాప్ లుగా తేలగా నాగ్ ఈ సినిమా మీద చాలా నే ఆశలు పెట్టుకున్నాడు. బాహుబలి 2 తప్ప సీక్వెల్స్ ఇప్పటి వరకూ ఏ హీరో , డైరెక్టర్ కీ హిట్ రాలేదు. రాజుగారి గది 2 తో సీక్వెల్ హిట్ కొట్టి కొత్త ట్రెండ్ సృష్టించాలి అని నాగ్ ప్లాన్ అనుకుంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: