గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరయ్యారు.  ఈ రోజు నటి చార్మి సిట్ ముందు హాజరయ్యింది.  అయితే తనపై అన్యాయంగా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయని..చార్మి కోర్టును ఆశ్రయించింది.  కోర్టు తీర్పులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు చార్మిని విచారించాలని..విచారణలో మహిళా అధికారి తప్పనిసరిగా ఉండాలని షరతు విధించింది.  
Image result for కానిస్టేబుల్ పై చార్మీ ఫిర్యాదు లాయర్
అయితే చార్మీ అనుమతి లేకుండా బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తన వ్యక్తిగత లాయర్‌ సమక్షంలో విచారించాలన్న చార్మీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా సిట్ ముందు హాజరు కావడానికి వచ్చిన చార్మికి అవమానం అయ్యిందని ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై సినీ నటి ఛార్మీ ఫిర్యాదు చేసింది.  

            చార్మీ కేసులో కోర్టు తీర్పు.. ఆ ఒక్క విషయంలో షాక్..!
బుధవారం ఉదయం విచారణకు సిట్‌ కార్యాలయానికి వచ్చిన తనపట్ల కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిట్ విచారణ కోసం అబ్కారీ ఆఫీసులోకి వెళ్లే సమయంలో మహిళా కానిస్టేబుల్స్‌ ఉన్నప్పటికీ తనను తాకుతూ శ్రీనివాస్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడని తెలిపారు. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఎలా పరిచయం అనేవాటిపై ప్రశ్నిస్తున్నారు.

తాను కార్యాలయానికి వచ్చిన సమయంలో కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రధాన ద్వారానికి అడ్డుగా నిల్చున్నారని, వారిని ఛేదించుకుంటూ రావడం కష్టమైందని ఆమె చెప్పింది.  ఆ సమయంలో తన చేతులు పట్టుకుని లాగేందుకు కొందరు ప్రయత్నించారని, శ్రీనివాస్ తనను అభ్యంతరకరంగా తాకాడని తన ఫిర్యాదులో పేర్కొంది.  
Image result for చార్మీ  లాయర్
దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఎలా పరిచయం అనేవాటిపై ప్రశ్నిస్తున్నాట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: