జబర్దస్త్ షోతో మంచి పాపులర్ సంపాదించిన రష్మి గౌతం గుంటూర్ టాకీస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేసిన రష్మి తన తొలిముద్దు అనుభవాన్ని షేర్ చేసుకుంది. రానా హోస్ట్ గా వస్తున్న నెంబర్ 1 యారిలో రష్మి గెస్ట్ గా రాగా అందులో రానా అడిగిన తొలి ముద్దు అనుభవం గురించి రష్మి అదెప్పుడో 14 ఏళ్లకే జరిగిందని చెప్పింది. 


అది కూడా ఏదో ఎక్సయిట్మెంట్ లో ఎక్స్ పెరిమేంటల్ గా అలా చేశానని చెప్పుకొచ్చింది రష్మి. రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు అసలు సిసలు అర్ధం చెప్పేలా ఫైర్ బ్రాండ్ ప్రశ్నలను వేస్తూ గెస్టులను తికమక పెడుతున్నాడు రానా. అదే క్రమంలో రష్మిని కూడా ముద్దుల సంభాషణలో భలే ఎంటర్టైన్ చేశాడు. కరెంట్ సినిమాలో హీరోయిన్ పక్కన కనిపించిన రష్మి ఆ తర్వాత అడపాదడపా హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రలలో అలరించింది.


ఇక అనసూయ జబర్దస్త్ నుండి తొలగడం ఆ టైంలోనే రష్మి ఎంట్రీ ఇవ్వడం అమ్మడి క్రేజ్ అమాంతం రెట్టింపయ్యింది. గుంటూర్ టాకీస్ లో కూడా ముద్దుల హంగామా చేసిన రష్మి ఆ తర్వాత అదే ఇమేజ్ తో సినిమాలను వరుసగా చేసుకుంటూ వచ్చింది. దర్శకులు ఎలా కోరితే అలా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్న రష్మి అటు బుల్లితెర ఇటు వెండితెర రెండిటిని సమపాళ్లలో కెరియర్ ప్లాన్ చేసుకుంటుంది. 


ప్రస్తుతం ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న రష్మి ఆ సినిమాతో తను కేవలం గ్లామర్ షో చేసేందుకే కాదు మంచి అభినయం కనబరుస్తానని అంటుంది. అవకాశం వస్తే ఎలాంటి చాలెంజింగ్ రోల్ అయినా చేస్తా అంటున్న రష్మి చాన్స్ వస్తే ఐటం సాంగ్స్ అయినా ఒకే అనేస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: