ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది బిగ్ బాస్ షో.   ప్రస్తుతం భారత దేశంలో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో ప్రసారం అవుతుంది. తాజాగా తెలుగు బుల్లితెరపై మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్ షో’.  తెలుగు లో బిగ్ బాస్ షో 70 రోజులు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పది రోజులు గడిచిపోయింది..ఇక పది రోజుల్లో ఎన్నో ట్విస్ట్ లు, చిన్న చిన్న గొడవలు, గిల్లి కజ్జాలతో కొనసాగింది.  Image result for telugu big boss
అయితే మొదట కెప్టెన్సీ బర్నింగ్ స్టార్ సంపూ దక్కించుకున్నాడు.   కానీ తన విధులు సరిగా నిర్వహించకపోవడంతో కెప్టెన్సీ నుంచి బిగ్ బాస్ తొలగించాడు. ఆ తర్వాత కెప్టెన్సీ సింగర్ కల్పన దక్కించుకుంది. ఎప్పుడైతే కల్పన కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిందో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మిగతా టీమ్ సభ్యులు ఆరోపిస్తున్నారు.  నిన్న జరిగిన టీమ్ సభ్యుల అభిప్రాయ సేకరణలో ఒక్కోక్కరూ ఒక్కో రకంగా చెప్పారు.

 అయితే బిగ్ బాస్ హౌజ్ లో బాగా ముదురు అని పిలుస్తున్న ధన్ రాజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  నాకు కల్పన అక్కలో ఎన్నో మార్పులు వచ్చినట్లు అనిపిస్తుందని..కిచెన్ లో ఉన్న కల్పనక్క మాకు గోరు ముద్దలు తినిపించేదని..ఇప్పుడు ప్రతీ విషయంలో రూల్స్ మాట్లాడుతూ కొత్తగా కనిపిస్తుందని అన్నాడు.

తర్వాత సమీర్ గురించి మాట్లాడుతూ..ఆయన చూపుల్లోనే కాస్త సీరియస్ నెస్ ఉంటుందని..మొన్న గేమ్ ఆడే సమయంలో నన్ను నక్కతో పోల్చాడని చాలా బాధగా అనిపించిందని..ఇంకా ఏ జంతువుతో పోల్చినా నేను బాధపడే వాడిని కాదని అన్నాడు. నేను బాలాజీతో ఏదో మాట్లాడుతుంటే..పాలిటిక్స్ నేర్పకు అన్నారు..ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యానని వెంటనే బాత్ రూమ్ కి వెళ్లి పావుగంట ఏడ్చానని..ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఏడ్చానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: