సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటీ నటులు రిలీ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని ప్రేమ వివాహాలు చేసుకున్నారు.  కొంత మంది ఇప్పటి వరకు కలిసి మెలిసి జీవిస్తుంటే..మరికొందరు విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.  ఇక బుల్లితెరపై కూడా చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు.  తాజాగా బాలీవుడ్ బుల్లితెరపై వచ్చిన ‘హరహర మహాదేవ’(హిందీ డబ్బింగ్) సీరియల్‌లో పార్వతి పాత్ర పోషిస్తున్న చుంకీ పూజా బెనర్జీ వచ్చే నెలలో ఒక ఇంటిది కాబోతోంది.
Are TV couple Puja Banerjee and Kunal Verma back together?
ఈ అమ్మడు కూడా తన సహనటుడు టీవీ యాక్టర్ కుణాల్ వర్మను పూజ వివాహం చేసుకోనుంది.  గత ఆరు సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఆ మద్య విడిపోయినట్లు వార్తలు తెగ హల్ చల్ చేశాయి. వాటిని ఖండిస్తూ వారు త్వరలో వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. 2008-10 మధ్యకాలంలో వచ్చిన టీవీ సీరియల్ ‘తుఝ్ సంగ్ ప్రీత్ లగాయీ సజనా’ లో వీరిద్దరూ లీడ్ రోల్ పోషించారు.  

ఆ సమయంలోనే వీరిద్దరి మద్య ప్రేమ చిగురించి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.  ఇక పూజ విషయానికి వస్తే ఈ అమ్మడు ఇప్పటికే పలు హిందీ టివి సీరియల్స్ లో నటించింది.  

ఇక తెలుగు లో ఆ మద్య వచ్చిన ‘హర హర మహాదేవ్’ లో పార్వతి పాత్రలో తెలుగు వారి మనసు కూడా దోచింది.  అంతే కాదు గతంలో గతంలో పూజా బెనర్జీ ‘రాజధాని ఎక్స్ ప్రెస్’ అనే టాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. త్వరలో తన బాయ్ ఫ్రెండ్  కుణాల్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: