అసెంబ్లీ రౌడీ...! మోహ‌న్ బాబు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా. అరిస్తే క‌రుస్తా... అంటూ వెరైటీ డైలాగులు ఈ సినిమాలో ప‌లికాడు క‌లెక్ష‌న్ కింగ్‌. దాంతో పాటు పాట‌లూ హిట్టే. ఈ సినిమాని రీమేక్ చేయాల‌నేది విష్ణు ఆలోచ‌న‌. దానికి త‌గిన ద‌ర్శ‌కుడు పూరి జ‌గన్నాథ్ అనుకొంటున్నాడ‌ట. ఈ సినిమా చేయ‌డానికి పూరి కూడా ఒప్పుకొన్నాడు.

నిర్మాత‌ని వెదుక్కోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే... చేతిలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ఉంది. అందుకే పూరి కూడా ఏమాత్రం ఆలోచించ‌కుండా రంగంలోకి దిగిపోయాడ‌ట‌. దీనికి వీడికి ఎదురులేదు అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించేశారు. క‌థ గురించి పూరి ఎక్కువ‌గా ఆలోచించ‌డు, పైగా ఇది రీమేక్ క‌థ కాబ‌ట్టి ఆ అవ‌స‌రం కూడా లేదాయె.


నితిన్‌తో హార్ట్ ఎటాక్ సినిమాని చ‌క‌చ‌క లాగించేసి ఈ అసెంబ్లీ రౌడీని ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు పూరి! మ‌రి ఈ న‌యా రౌడీ ఎలా ఉంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: