గ‌బ్బ‌ర్ సింగ్ కి అవార్డుల‌న్నీ పాదాక్రాంతం అవుతున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్‌లోని ప‌వన్ క‌ల్యాణ్ న‌ట‌న‌కు మొన్నే మా టీవీ అవార్డు వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ఫిల్మ్‌ఫేర్ వ‌రించింది. ఆదివారం హైద‌రాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్ (సౌత్‌) అవార్డుల ప్రదానోత్స‌వం జ‌రిగింది. ఉత్త‌మ న‌టుడిగా వ‌వ‌న్ క‌ల్యాణ్ ఎంపిక‌య్యాడు. ఈ అవార్డును ప‌వ‌న్ త‌ర‌పున రామ్‌చ‌ర‌ణ్ అందుకొన్నాడు. ఉత్త‌మ న‌టిగా స‌మంత (ఈగ) ఎంపికైంది.


రాజ‌మౌళి ఈగ అయిదు అవార్డులు ఎగ‌రేసుకుపోయింది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, విజువ‌ల్ ఎఫెక్టుల విభాగంలో పుర‌స్కారాలు ద‌క్కించుకొంది. ఉత్త‌మ సంగీత దర్శ‌కుడు, ఉత్త‌మ గాయ‌కుడు విభాగాలు మాత్రం గ‌బ్బ‌ర్‌సింగ్‌కి ద‌క్కాయి. చాలా కాలం త‌ర‌వాత కెమెరా ముందుకు వ‌చ్చిన అమ‌ల‌కి ఉత్త‌మ స‌హాయ న‌టి - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌)) గా ఎంపికైంది.


సాధారణంగా పవన్ అవార్డులు తీస్కోవడానికి రాడు. అయితే ప్రస్తుతం నడుస్తున్న మెగా కుటుంబ సభ్యుల మనస్పర్ధల విషయంలో ఇలా చరణ్ వచ్చి బాబాయ్ తరఫున అవార్డు తీస్కోవడం కొంచం సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: