తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెను సంచలనాలు సృష్టించిన సుచిలీక్స్ గురించి తెలియనివారు ఉండరు.  తమిళ తారల ప్రయివేటు ఫొటోలను విడుదల చేస్తు సుచిలీక్స్‌ ఖాతా ద్వారా సంచలనం సృష్టించింది గాయని సుచిత్ర. మొదటగా తన ఖాతా హ్యాక్‌ అయ్యిందని ఆరోపించి సుచి తర్వాత తనపై  సినిమా ఇండస్ట్రీవారు దాడి చేశారని అందుకే వారి బాగోతాలు బయట పెడుతున్నా అంటూ రక రకాలుగా వ్యాఖ్యలు చేసింది.  మరోవైపు ఆమె భర్త తన భార్యకు మతి స్థిమితం సరిగా లేని కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు.  
Image result for suchi leaks
ఏది ఏమైనా సుచిలీక్స్ లో ఎక్కువ హీరో ధనుష్, అమల పాల్ పేర్లు బాగా వినిపించాయి.  అంతే కాదు వీరికి సంబంధించిన ఓ బూతు వీడియో కూడా ఉందని త్వరలో అది పోస్ట్ చేస్తామని అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ సృష్టించాయి. తాజాగా నేను ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని , ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదని ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ అమలా పాల్.
Image result for suchi leaks
 తెలుగు, తమిళ, మళియాళ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో వి ఐ పి గా తెలుగులో రఘువరన్ బిటెక్ గా సంచలన విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్ గా వి ఐ పి 2 తెరకెక్కింది. ఈ చిత్రంలో కూడా అమలా పాల్ ధనుష్ కు జంటగా నటించింది.  ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ సినిమాపై క్యూరియాసిటి పెంచుతున్నారు. రిలీజ్ కి రెడీగా ఉన్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పెటాకులైన తర్వాత హీరోయిన్ గా చాలా బిజీ అయ్యింది అమలా పాల్.



మరింత సమాచారం తెలుసుకోండి: