మీరు చదువుతున్నది గాలి వార్త కాదు. ఖచ్చితమైన నిజం. కాని ఈ కమెడియన్ మన టాలీవుడ్ కు చెందిన వాడు కాదు. కోలీవుడ్ కి చెందిన కమెడియన్ సంతానం. ప్రస్తుతం తమిళనాట ఏ సినిమా హీరోకి ఉండని క్రేజ్ సంతానం ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు చిన్నవయసులోనే ఎక్కువగా సంపాదిచేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో అటు స్టార్ హీరోల సినిమాలు, ఇటు కుర్ర హీరోల సినిమాలు, ఏ సినిమాలో అయినా సంతానం ఉండి తీరవలసిందే. స్క్రీన్ పై సంతానం మొహం కనిపిస్తే చాలు తమిళ తంభిలు ఉత్సాహంతో ఈలలు వేస్తున్నారు.

ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ సంతానం ఇప్పటిదాకా తనకి ఒక కాల్ షీట్ కి ఇస్తున్న 10 లక్షల పారితోషికాన్ని ఏకంగా 20 లక్షల స్థాయికి పెంచేశాడట. అంతేకాదు కోలీవుడ్ నిర్మాతలు సంతానం కాల్ షీట్స్ కోసం సంతానం ఇంటికి వెళ్ళితే, ఆ సినిమాకి హీరో ఎవరు..? అని అడగడమే కాకుండా తనకు నచ్చిన కొంతమంది హీరోలను పెట్టుకొని సినిమాలు తియ్యమని సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడట. ప్రస్తుతం కోలీవుడ్ లో సంతానం ఆడిందే ఆట, పాడిందే పాట అని అంటున్నారు. ఈమధ్య ఒక తమిళ నిర్మాత హీరో శివకార్తికేయాన్ హీరోగా పెట్టుకొని సినిమా తీస్తూ, సంతానం డేట్స్ కోసం వెళ్ళితే, ఆ సినిమా కధకు శివకార్తికేయన్ సరిపోడని అంటూ మరో హీరో పేరు సూచించాడట.

ప్రస్తుత టాప్ హీరోలు సూర్య, విజయ్ లాంటి వారు కూడా సంతానం డేట్స్ ఎప్పుడు ఇస్తే, తాము కూడా ఆ డేట్స్ కు అనుగుణంగా కాల్ షీట్స్ ఇస్తామని చెప్పడం చూస్తూ ఉంటె సంతానం రేంజ్ ఏమిటో తెలిసిపోతోంది. ప్రస్తుత కోలీవుడ్ టాప్ హీరోల ఆదాయం కన్నా, సంతానం ఆదాయం చాలా ఎక్కువగా ఉంటోందని కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాట సంతానానికి వచ్చిన క్రేజ్ ను పసిగట్టి మరి మన తెలుగు టాప్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఇదే పరిస్థితి అవలంభిస్తే మన తెలుగు నిర్మాతల పరిస్థితి ఏమిటో వారే ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: