సినీ లవర్స్ కు పండగే పండగ.. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్రేజియస్ట్ సినిమాలు బాక్సాపీస్ ను షేక్ చేయబోతున్నాయి. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా సెలవులు వచ్చాయి. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు బిగ్ స్క్రీన్స్ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమైపోయారు. శుక్రవారం రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి, నితిన్ చేసిన లై, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయజానకి నాయక సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Image result for nene raju nene mantri

భల్లాలదేవుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దగ్గుబాటి రానా తాజాగా నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించారు. కాజల్ హీరోయిన్ గా నటించింది. విభిన్న కథలతో వరుస హిట్లతో దూసుకుపోతున్న రానా, ఫ్లాప్ డైరెక్టర్ తేజతో సినిమా చేయడం ఓ సంచలనం. అయితే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లో వందమంది ఎమ్మెల్యేలను కొని స్టార్ హోటల్ లో పెడితే నేనే సీఎం అని రానా చెప్పిన డైలాగ్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.

Image result for jaya janaki nayaka

ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జయజానకి నాయక సినిమా కూడా శుక్రవారమే రిలీజవుతోంది. లెజెండ్, సరైనోడు సినిమాల వంటి బ్లాక్ బాస్టర్ లు తీసిన బోయపాటి కొత్త కుర్రాడు బెల్లంకొండ శ్రీను హీరోగా పక్కా ప్రేమకథతో సినిమా తీశాడు. ప్రేమకథా చిత్రమే అయినా ఇందులో బోయపాటి మార్క్ మాస్ మసాలాలకు ఢోకా లేదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటించడం, సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం.. సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి.

Image result for lie nitin

వీటితో పాటు శుక్రవారమే రిలీజ్ కానున్న మరో సినిమా లై. అ..ఆ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత హీరో నితిన్ నటించిన సినిమా కావడం.. నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తుండడంతో దీనిపై మొదటి నుంచి క్రేజ్ నెలకొంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ సినిమా డైరెక్టర్. యాక్షన్ హీరో అర్జున్ ఈ సినిమాలో విలన్. ఇప్పటికే ఈ  సినిమా ట్రైలర్,  సాంగ్స్ ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి. ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వనుండగా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: