త్రివిక్రమ్ శ్రీనివాస్ హవా మొదలు అయ్యే వరకూ టాలీవుడ్ లో నెంబర్.1 రైటర్ ఎవరు..? అంటే పరుచూరి బ్రదర్స్ పేరే చెప్పేవారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కు తెలుగు ప్రేక్షకులు అలవాటు పడడంతో టాలీవుడ్ సినిమా ట్రెండ్ మారి కధ కన్నా సంభాషణలను పట్టించుకొనే స్థాయి కి టాలీవుడ్ ప్రేక్షకులు మారారు. ఆయన మాటలలో ఎంతో అర్ధం ఉంటుంది. అంతేకాదు ఆయన రాసిన ప్రతీ మాట ఆ సినిమా చూసే ప్రేక్షకుడి జీవితంలో జరిగిన ఏదో ఒక సంఘటన కు సంబంధించి ఉంటుంది. అందుకే ఆయన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అయిపోతారు. అందుకే అతనికి మాటల మాంత్రికుడు అని పేరువచ్చింది. ఆయన మాటలు ప్రేక్షకులనే కాదు టాప్ హీరోలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.

అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు. ‘ఖలేజా’ సినిమా వరకూ మనకు కనిపించిన మహేష్ వేరు. ఆ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన తరువాత మహేష్ కనిపిస్తున్న తీరు వేరు. అంత వరకూ టాలీవుడ్ లో ఎవరితోనూ అంతగా కలవకుండా ఎక్కువ సేపు ఏకాంతంగా ఉండడమే కాకుండా మీడియా ను కూడా దూరంగా ఉంచే మహేష్, ‘ఖలేజా’ సినిమా తరువాత పూర్తిగా మారిపోయి అందరితో కలిసిమెలిసి ఉండడమే కాకుండా మీడియా ను కూడా చక్కగా మేనేజ్ చేస్తూ, టాలీవుడ్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా ఉంటున్నాడు. తనలో వచ్చిన ఈ మార్పుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ యే కారణం అంటూ బహిరంగంగానే ‘ఖలేజా’ విడుదల తరువాత మహేష్ చెప్పాడు.

అలాగే ఈమధ్య నే జరిగిన ‘అత్తారింటికి దారేది’ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ తనను ఎంతో ప్రభావితం చేశాడని, తనకు జీవితం పట్ల ధైర్యం నూరిపోశాడని, అతడితో ఉంటే తనకు సమయం తెలిసేది కాదని అనడమే కాకుండా జీవితం గురించి ఆయన చెప్పిన మాటలు తన జీవిత ద్రుక్పధాన్నే మర్చివేశాయని బహిరంగంగా పవన్ కళ్యాణ్ చెప్పడం చూస్తే ఈ మాటల మాంత్రికుడు తన మాటలతో ఎంత పెద్ద సెలబ్రిటీలను అయినా తన వైపు తిప్పుకుంటాడో అర్ధం అవుతుంది. మీడియా అంటే ఆమడ దూరం పారిపోయే మోనార్క్ లాంటి ఇద్దరు టాప్ హీరోలను తన మాటల మాయతో మార్చిన దర్శకుడిగా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించాడు. అందుకే కాబోలు ఈ మాటల మాంత్రికుడి పంచ్ డైలాగ్స్ కు సినిమా కధతో సంబంధం లేకుండా కనకవర్షం కురిపిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: