బాహుబలి మూవీ తర్వాత టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై చర్చ జరిగింది. దీంతో బాలీవుడ్ లో దక్షిణాది హీరోల సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోందనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Image result for shahrukh amitabh rajinikanth

        బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ శిద్యాత్. డిసెంబర్ లో క్లాప్ కొట్టుకునే ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా ఎంపికైంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ రొమాంటిక్ మూవీలో పలువురు ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా నటిస్తారనే వార్త ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో హల్ చల్ చేస్తోంది.

Image result for shahrukh amitabh rajinikanth

        షారూఖ్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళన సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కూడా గెస్ట్ రోల్స్ పోషిస్తారనేది ఇప్పుడు బాలీవుడ్ టాక్. గెస్ట్ పాత్రల్లో నటించేందుకు ఈ ముగ్గుర స్టార్స్ అంగీకరించారని తెలియగానే ఈ మూవీపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.


       Image result for prabhas షారూఖ్ ఖాన్, అమితాబ్ కాంబినేషన్ లో గతంలో సినిమాలొచ్చాయి. అవి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కురిపించారి. ఇక సౌతిండియా బ్యాక్ డ్రాప్ లో సాగే చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో షారూఖ్ నటించి దక్షిణాదికీ దగ్గరయ్యాడు. రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు కాసుల వర్షమే. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ కూ పాకింది. వీరందరి కాంబినేషన్ లో మూవీ రావడం ఖాయమైతే మాత్రం అదొక పెద్ద సంచలనమే.!


మరింత సమాచారం తెలుసుకోండి: