మూడు తరాలు  ఒకే తెర మీద కనిపించడం  అంటే అభిమానులకు కన్నులపండుగ విషయం, అలాంటిదే త్వరలో తెలుగు తెర మీద జరగనుంది అక్కినేని కుటుంబం నుండి మూడు తరాల హీరోలు ఒకే తెర మీద కనిపించనున్నారు .

మనం" అన్న పేరుతో మన ముందుకి రానున్న ఈ చిత్రానికి విజయ్  కుమార్ దర్శకత్వం వహిస్తుండగా  అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది .ఇప్పటికే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ మొదలయ్యింది నాగ చైతన్య మరియు సమంత  మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు ఆగస్ట్ మొదటి వారం నుండి

ఈ చిత్ర చిత్రీకరణ లో నాగేశ్వర రావు గారు మరియు నాగార్జున పాల్గొననున్నారు . నాగార్జున సరసన శ్రియ నటిస్తుంది ఈ చిత్రం మరో రెండు నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది . అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: