స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు మాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ అతడిని మళయాళ మూవీ ప్రేక్షకుడు మల్లుఅర్జున్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. దీనికితోడు మలయాళ యూత్ కు బన్నీ డాన్స్ లు అంటే విపరీతమైన క్రేజ్.

దీనితో అల్లుఅర్జున్ సినిమాలు అన్నింటినీ మలయాళ భాషలోకి డబ్ చేస్తున్నారు. మొదట్లో బన్నీ నటించిన ‘బద్రీనాథ్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ఫెయిల్ అయినా ఆ తరువాత బన్నీ నటించిన చాల సినిమాలు మాలీవుడ్ లో విడుదల అయి భారీ విజయాలను నమోదు చేసాయి. 

దీనితో కొద్ది కాలం క్రితం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీని భారీ అంచనాలతో భారీగా పబ్లిసిటీ చేసి ఈమధ్య విడుదల చేసారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘దువ్వాడ’ పై మాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చే తీర్పు ఇచ్చారు. 

ఈసినిమా మాలీవుడ్ లో ఘోరమైన ఫ్లాప్ గా మారడమే కాకుండా ఈమూవీకి కనీసం సాధారణ స్థాయి ఓపెనింగ్స్ కూడ రాకపోవడం ఈసినిమాను మలయాళంలోకి డబ్ చేసిన నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు టాక్. దీనితో బన్నీ హవా ఓవర్సీస్ లోనే కాదు మాలీవుడ్ లో కూడ ఏమాత్రం పనిచేయడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీని కొనుక్కున్న మన తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లకు దాదాపు 30 శాతం వరకు నష్టాలు వచ్చాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బన్నీ మార్కెట్ కు
ఇలా ఒకేసారి అన్ని చోట్ల ఎదురీత మొదలవడం షాకింగ్ న్యూస్ అనుకోవాలి. అందుకే కాబోలు బన్నీ వక్కంతం వంశీతో చేస్తున్న తన లేటెస్ట్ మూవీ కోసం ఏకంగా రెండు నెలలు తన లుక్ ను మార్చుకోవడానికి చాల కష్టపడుతున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: