హీరో ప్రభాస్ తన ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయినా ఎటువంటి ఇగో ప్రదర్శించకుండా చాల సరదాగా ఉంటాడు. ‘బాహుబలి 2’ సూపర్ సక్సస్ తరువాత ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఏ ఫంక్షన్ కు రాలేదు.

దీనితో ప్రభాస్ ప్రస్తుత లుక్ ఎలా ఉంది అన్న రకరకాల ఊహాగానాలకు నిన్న తెరపడింది. భాగ్యనగరంలో జరిగిన ‘ఆనందో బ్రహ్మ’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు నిన్న ప్రభాస్ అతిధిగా రావడమే కాకుండా తన సహజసిద్ధమైన హాస్య ధోరణితో ఈమూవీ హీరోయిన్ తాప్సీని అందమైన దెయ్యంగా అభివర్ణిస్తూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు. 

ఇదే సందర్భంలో ఈసినిమా కథ గురించి మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు మనుష్యులను భయపెట్టే దెయ్యాల కథలను విన్నానని అంటూ ఈసినిమా కథను లీక్ చేసాడు. అయితే మొట్టమొదటిసారి ఈసినిమాలో మనుషులను చూసి భయపడిపోయే దెయ్యం ట్విస్ట్ ‘ఆనందో బ్రహ్మ’ మూవీలో ఉండబోతోంది అంటూ ఆ సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. 

ఈసినిమా నిర్మాత తన స్నేహితుడు విజయ్ గురించి  మాట్లాడుతూ అతడు తనను ఎప్పుడు కలిసినా సినిమాల గురించి విపరీతంగా మాట్లాడుతాడని అంటూ ఆ గోల భరించలేక తాను విజయ్ ను ‘ఆపరా బాబు’ అంటూ చెప్పినా  వినిపించుకోడని జోక్ చేసాడు. దీనితో ప్రభాస్ మాటలకు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు అంతా  తెగ నవ్వుకున్నారు.

ఈవారం విడుదల కాబోతున్న ఈసినిమా పై మంచి పాజిటివ్ టాక్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి వెన్నెల కిషోర్ ప్రభాస్ శ్రీను నటిస్తున్న ఈ సినిమా మొత్తం విపరీతమైన హాస్యంతో ఉంటుందని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: