తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  హీరోగా మంచి ఫామ్ లో ఉండగా శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు.  ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంత కాలం పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఇక రాజకీయాల్లోకి వెళ్లిన పది సంవత్సరాల తర్వాత ఆయన తనయుడు రాంచరణ్ నిర్మాణ సారధ్యంలో వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.  
Related image
ఈ చిత్రం చిరంజీవికి 150వ చిత్రం కావడం మరో విశేషం.  అయితే ఇండస్ట్రీలో చిరు క్రేజ్ పడిపోయిందని..ఆయన హీరోగా పనికిరారూ అని ఎద్దేవా చేశారు.  కానీ ఈ సంవత్సరం చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం రిలీజ్ తర్వాత అందరి అంచనాలు తలకిందులయ్యాయి..గత పది సంవత్సరాల క్రితం చిరంజీవి ఎలా ఉన్నాడో..ఇప్పుడూ అలాగా కనిపించారు.  ఆయనలో గ్రేస్, స్టైల్, స్టామినీ ఏమీ తగ్గలేదని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు చిరుకి బ్రహ్మరథం పట్టారు.  ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ భారీగా కలెక్షన్లు రాబట్టింది.  
Image result for uyyalawada narsimha
ఇక చిరంజీవి 151 వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.  అయితే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలిసిన‌ప్ప‌టికి, ఈ మూవీ ఎప్పుడు లాంచ్ ఇప్పటి వరకు కాలేదు.  దీంతో నిరాశకు గురైన అభిమానులు ఇప్పుడు గుడ్ న్యూస్.  
ఎట్ట‌కేల‌కు మొద‌లైన చిరు 151వ చిత్రం
ఈ రోజు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ఆఫీసులో చిరు 151వ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌రణ్ , అల్లు అర‌వింద్, ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్, సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర లోగోని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: