పవన్ కళ్యాణ్ కు అతి సన్నిహితంగా ఉండే అతి తక్కువమంది వ్యక్తులలో శరత్ మరార్ ఒకరు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ‘జానీ’ సినిమా నుండి పెనవేసుకున్న వీరి సాన్నిహిత్యం ఇప్పుడు పూర్తిగా దూరం అయింది అన్న వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో తెగ హడావిడి చేస్తున్నాయి.

శరత్ మరార్ ను నిర్మాతను చేసి పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలను కూడ తీయించాడు. అయితే ఈరెండు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా ఈ రెండు సినిమాల మార్కెట్ మటుకు విపరీతంగా జరగడంతో ఈరెండు సినిమాలు విడుదల కాకుండానే శరత్ మరార్ కు లాభాలను తెచ్చి పెట్టాయి.

అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోర పరాజయం తరువాత తీవ్రంగా నష్టపోయిన ఆ సినిమా బయ్యర్లు తమకు ఆ నష్టాలు తీర్చమని శరత్ మరార్ పై తీవ్ర ఒత్తిడి చేసారు. ఈ విషయంలో ఆ మూవీ బయ్యర్లకు కొన్ని వాగ్దానాలు శరత్ మరార్ చేసినా ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో శరత్ మరార్ కు పవన్ సహకారం లభించక పోవడంతో సున్నితమనస్కుడైన శరత్ మరార్ అప్పటి నుండి బాగా షాక్ అయ్యాడు అన్న గాసిప్పులు ఎప్పటి నుంచో హడావిడి చేస్తున్నాయి. 

\దీనికితోడు ఎప్పుడూ పవన్ ను అంటిపెట్టుకుని ఉండే శరత్ మరార్ ఈమధ్య పవన్ బయట కనిపించే కార్యక్రమాలలో కాని పవన్ తన సన్నిహితులతో చర్చించే ముఖ్య విషయాల నిర్ణయాలలో కాని శరత్ మరార్ కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య ఏమైంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే ఇవన్నీ గాలివార్తలే అనీ ఎప్పటి నుంచో తనకు సన్నిహితుడైన శరత్ మరార్ ను పవన్ పవన్ వదులుకోడనీ వీరిద్దరూ మళ్ళీ కలిసి సందడి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ వస్తున్న ఈ గాసిప్పులను ఖండిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: