హీరోయిన్ రకుల్ ప్రీత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఒక సినిమాలో నటిస్తోంది అంటే చాలు సూపర్ రెమ్యునరేషన్ అప్ప జెప్తారు. తన కెరీర్ లు దాదాపు అన్నీ హిట్ లు కొట్టిన రకుల్ గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ జనల చేత పిలిపించుకుంటోంది.


ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ సినిమాలో కనిపించబోతున్న ఈమ తాజాగా ఇంటర్వ్యూ లో తనకి కాబోయే భర్త కి సంబంధించి విషయాలు బయట పెట్టింది.


తనకు కాబోయే వాడు మంచి అందగాడై ఉండకపోయినా, పొడగరి అయి ఉండాలని మాత్రం చెప్పింది. " అన్నిటికంటే ముఖ్యంగా అతను చాలా మంచివాడు అయ్యి ఉండాలి, ముఖ్యంగా నన్ను అర్ధం చేసుకో గలగాలి.


ఎందుకంటే నా మైండ్ సెట్ అర్ధం చేసుకోవడం కాస్త ఇబ్బందికర విషయమే. ఒక వ్యక్తి మంచి చెడులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది కాబట్టి కొన్నాళ్ళు అతని ప్రవర్తన తెలుసుకోవడం కోసం కలిసి ఉండడానికి కూడా సిద్దం. ఇది పెళ్ళికి ముందర జరిగితేనే బెటర్ అని నా ఫీలింగ్. " అంటోంది ఆమె 

మరింత సమాచారం తెలుసుకోండి: