ఇపుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవ‌రంటే సందేహం లేకుండా స‌మంతాయే అని డిక్లేర్ చెయోచ్చు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్రిన్స్ మ‌హేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సూర్య లాంటి టాప్ స్టార్స్ తో అంద‌రితోనూ న‌టిస్తూ హై రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న భామ స‌మంతానే.

న‌టించిన ప్రతి సినిమా హిట్టవ్వడంతో అమ్మడికి గోల్డెన్ లెగ్ అని ట్యాగ్ లైన్ కూడా త‌గిలించేశారు. అయితే ఇపుడు చెప్పుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే 2012 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఏకంగా రెండు అవార్డులు అందుకుంది ఈ సుంద‌రి . తెలుగులో ఈగ‌, త‌మిళంలో నీదాన్ ఎన్ పోన్ వసంతం( ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు) సినిమాల‌కుగానూ బెస్ట్ యాక్ట్ట్రెస్ గా స‌మంత అవార్డ్స్ అందుకుంది. ఇంకో విషయం ఏంటంటే 21 సంవ‌త్సరాలు త‌రువాత స‌మంత ఇలాంటి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. గ‌తంలో రేవ‌తి తెలుగులో అంకురం, త‌మిళంలో దేవ‌ర్ మ‌గ‌న్ ( క్షత్రియ పుత్రుడు) సినిమాల‌కుగానూ ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది. మ‌ళ్లీ ఇన్నాళ్లకు స‌మంత ఈ అరుదైన డ‌బుల్ ద‌మాకా రికార్డ్ క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: