సమంత తాను అక్కినేనివారి కోడలిని అవుతానని కలలో కూడ అనుకోలేదు అంటూ ఆమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు ప్రతిరోజు తనకు భగవంతుడు కలిగించిన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ తనకు తానే తన శరీరాన్ని అప్పుడప్పుడు గిల్లుకుంటూ ఇది అంతా కల నిజామా అని చెక్ చేసుకుంటూ ఉంటానని కూడ జోక్ చేసింది.

ఇలాంటి పరిస్థుతుల మధ్య సమంత ఇప్పుడు తన మామగారు నాగార్జునను వెయిటింగ్ లో పెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నాగార్జున నటిస్తున్న ‘రాజు గారి గది 2’ లో సమంత ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

హర్రర్ కామెడీ మూవీగా నిర్మాణంలో ఉన్న ఈసినిమా నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది. అయితే సమంతకు సంబంధించిన ఒకే ఒక్కరోజు షూటింగ్ మిగిలి ఉండటంతో ఈసినిమా దర్శకుడు ఓంకార్ సమంత పై ఒత్తిడి చేస్తూ ఆ ఒక్కరోజు షూటింగ్ ని పూర్తి చేయమని అడుగుతున్నట్లు టాక్. 

అయితే అక్టోబర్ లో సమంత చైతూల పెళ్లి జరుగుతున్న నేపధ్యంలో సమంత తాను ఒప్పుకున్న 6 సినిమాలను పూర్తి చేయడానికి హైదరాబాద్ చెన్నైల మధ్య తిరుగుతూ ఒక్కరోజు కూడ ఖాళీ లేకుండా బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తాము అని ఈసినిమా నిర్మాతలు ప్రకటించిన నేపధ్యంలో ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీ షూటింగ్ ను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఈసినిమా దర్శక నిర్మాతలు చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

దీనితో సమంతకు మిగిలి ఉన్న ఆ ఒక్కరోజు షూటింగ్ ను పూర్తిచేసి పెట్టమని దర్శకుడు ఓంకార్ ఏకంగా నాగార్జున చేత రికమండేషన్ చేయించుకోవలసి వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో సమంత తన బిజీతో ఏకంగా నాగార్జుననే వెయిటింగ్ లో పెట్టింది అన్న సెటైర్లు పడుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: