టీజర్ తోనే బాలయ్య ఫాన్స్ కి పండగ లాంటి అవుట్ పుట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు ట్రైలర్ తో కుమ్మేసాడు. ట్రైలర్ లో బాలయ్య యాటిట్యూడ్ మొత్తం చూపించిన పూరీ హీరోల ని మేక్ ఓవర్ చెయ్యడం లో తనకంటే బెస్ట్ డైరెక్టర్ లేడు అని మళ్ళీ ప్రూవ్ చేసాడు.


నా పేరు తేడా సింగ్. ధిమాక్ తోడా. చాలా తేడా అంటూ స్టార్ట్ చేసే బాలయ్య గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని.. మళ్ళీ టోర్నమెంట్స్ పెట్టొద్దు అంటాడు .. ఇలా ఒకటి కాదు రెండు కాదు సూపర్ డూపర్ కట్ డైలాగులు బోలెడు ఉన్నాయ్ ఈ ట్రైలర్ లో.


బీహార్ నీళ్ళు తాగిన వాళ్ళనే తీహార్ లో పోయించా అంటూ పంచ్ డైలాగులు బాగా పేలాయి. మొత్తం మీద బాలయ్య డోంట్ కేర్ యాటిట్యూడ్ అద్భుతంగా సూట్ అయ్యింది ఈ ట్రైలర్ లో.


కాకపోతే బాల‌య్య ప్ర‌తీ డైలాగ్‌నీ అరుస్తూ చెప్ప‌డం, ఆ గొంతులో జీర రావ‌డం, కాస్త షేక్ అయిన‌ట్టు అనిపించ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. కావాల‌ని డ‌బ్బింగ్ అలా చెప్పించాడా, లేదంటే సినిమా మొత్తం డైలాగులు ఇలానే ఉండ‌బోతున్నాయా? అనేది తెలీడం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: