సెప్టెంబర్ 1 న .. అన్నా రెండు బాల్కనీ టికెట్ లు కావాలి అంటూ ఫుల్ జోష్ మీద వస్తున్నాడు బాలయ్య బాబు. ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఇప్పటికే వచ్చేసింది.


బాలయ్య లాంటి యాక్షన్ హీరో కి పూరీ జగన్నాథ్ యాటిట్యూడ్ అద్దితే ఎలా ఉంటుంది అనేది జనం టీజర్ , ట్రైలర్ లు చూసి అర్ధం చేసుకున్నారు. సో ఇక విపరీతమైన హైప్ తో ఈ సినిమా రాబోతోంది.


బిజినెస్ పరంగా కూడా బాలయ్య గత చిత్రాలని ఈ చిత్రం బీట్ చేయ్యనుంది అంటున్నారు. అయితే అంత పెద్ద పైసా వసూల్ కి పోటీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నాడు అల్లరి నరేష్.


మేడ మీద అబ్బాయి సినిమా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా వచ్చేసి సాటిస్ఫై అవుట్ పుట్ కనిపిస్తూ ఉండడం తో ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 1 నే విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు . రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా… సెప్టెంబ‌రు మొద‌టి వారంలో సినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించేసింది. అసలే అపజయాలలో ఉన్న అల్లరి నరేష్ బాలయ్య తో పోటీ దిగడం అంటే అది అంత సమర్ధనీయం కాదు అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: